కృష్ణా జిల్లా.. టీడీపీకి కంచుకోట...అది మొన్నటి ఎన్నికల ముందు వరకే. ఇప్పుడు ఆ పదం సెట్ కాదేమో. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా నిలిచిన కృష్ణా జిల్లాలో మొన్న ఎన్నికల్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అలాగే ఒక ఎంపీ సీటుని గెలుచుకుంది. అయితే ఈ రేంజ్ లో ఓడిపోవడం...రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోవడంతో జిల్లాలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది. ఓటమి పాలవ్వగానే నేతలు చెట్టుకొకరు...పుట్టకొకరు అయిపోయారు.


పార్టీ పటిష్టానికి ఏ మాత్రం కృషి చేయకుండా వదిలేశారు. జిల్లాలో కొందరు నేతలు మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఓడిపోయి వంద రోజులు దాటినా కంచుకోటలో టీడీపీ ఇంకా కోలుకోలేదు. జిల్లాలో ఇద్దరు, ముగ్గురు నేతలు తప్ప పెద్దగా యాక్టివ్ గా కనపడటం లేదు. పలు నియోజకవర్గాల్లో నేతలు అడ్రెస్ లేరు. బందరు పార్లమెంట్ నుంచి ఓడిపోయిన కొనకళ్ళ నారాయణ అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు తప్ప..పెద్దగా పార్టీ కోసం కష్టపడింది లేదు. అటు మాజీ మంత్రుల్లో దేవినేని ఉమా, జవహర్, కొల్లు రవీంద్రలు కొంచెం యాక్టివ్ గా ఉన్నారు.


అయితే పెడన, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు నేతలు అడ్రెస్ లేరు. ఇక యువనాయకుడు దేవినేని అవినాష్ పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు. నగరంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎంపీ కేశినేని నాని వెళ్ళితే పార్లమెంట్ లేదంటే...నగరంలోనే ఉంటున్నారు. బొండా ఉమా పార్టీలో  ఉండాలా వద్దా అన్నట్లు ఉన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యాక్టివ్ గానే ఉన్నారు. ఇక జలీల్ ఖాన్, శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, ముద్దరబోయిన వెంకటేశ్వరావులు ఎక్కడ ఉన్నారో తెలియదు.


అటు కైకలూరు లో ఓడిపోయిన జయమంగళ అసలు కనిపించడం లేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ...నియోజవర్గంలో పని చేసుకుంటున్నారు. మొత్తం మీద అధికారం కోల్పోయి వంద రోజులు దాటినా...పార్టీని జిల్లాలో బలోపేతం చేసే కార్యక్రమాలు ఏమి జరగలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: