వైఎస్ జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శరవేగంగా నెరవేరుస్తూ ఉన్నారు. తన పాలనాకాలం ఐదేళ్లు ఉన్నా.. ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరగా నెరవేర్చి విశ్వసనీయతం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోయినా వాగ్దానాల అమలుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆయన అధికారంలోకి వచ్చాక చాలా వరకూ హామీలను నెరవేర్చారు.


తాజాగా మరో హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధమైంది. అదే.. సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకొంటూ వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న డ్రైవర్లకు ఏటా పదివేలు ఇచ్చే పథకం. దీని అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అర్హులైన డ్రైవర్లకు ప్రతి ఏటా 10 వేల రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది.


ఆటో డ్రైవర్లకు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం ఇన్స్యూరెన్స్, వెహికిల్ ఫిట్‌నెస్, మరమ్మత్తులు వంటి అవసరాలకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో, ట్యాక్సీ, మాక్సి క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్లు ‘వాహన మిత్ర’ పథకంలో నిర్ణీత ధ్రువపత్రాలను పొందుపరచడం ద్వారా అర్హత పొందుతారు. ఈ పథకానికి అర్హులైన వారు.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రుణం లేని బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ, సంబంధిత అకౌంట్ వివరాలను సమర్పించాలని అధికారులు తెలిపారు.


ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైతే తమ కులధృవీకరణ పత్రం కూడా సమర్పించాలని సూచించారు. సమర్పించిన ఆ డాక్యుమెంట్లను గ్రామ, వార్డు వాలంటీర్లు పరిశీలించి వాహనం సదరు యజమాని సంరక్షణలో ఉందో లేదో పరిశీలిస్తారు. ఈ సమాచారాన్ని, సదరు దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ, మున్సిపల్ కమిషనర్, బిల్లు కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారన్నారు. తర్వాత ఆ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: