ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నేతలు కూడా తీసుకోలేని విధంగా ఆయన పరిపాలన విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా సరే ముందుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు తనను ఇబ్బంది పెడుతున్న ప్రతీ ఒక్కరిని ఆయన తప్పించే కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంని జగన్ తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మరో అధికారిని నియమిస్తూ గంటల్లో నిర్ణయం తీసుకున్నారు.


సరే అది పక్కన పెడితే ఇప్పుడు సీఎస్ మార్చడంపై తెలుగుదేశం నేతలు కంగారు పడుతున్నారు. ఆయన్ను ఎందుకు మార్చారు అంటూ ఎల్వీ సొంత కులానికి చెందిన కొందరు, పరోక్షంగా టీడీపీకి మద్దతుగా లేఖలు రాస్తున్నారు. అధికారుల బదిలీ అనేది ప్రభుత్వ పెద్దల నిర్ణయం. దానిలో ప్రతిపక్షానికి పాత్ర గాని జోక్యం గాని అవసరం లేదు. కాని ఇక్కడ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి తెలుగుదేశం శ్రేణులు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గురించి సీఎస్‌ను మార్చారని రాతలు రాయడం మొదలుపెట్టారు. మరి ఒక్క ఎమ్మెల్యే గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మారుస్తారా...?


ఇక తిరుపతిలో అన్యమతాలకు ఆయన అడ్డుగా ఉన్నారని రాస్తున్నారు. కేవలం ఇది ఆర్ ఎస్ ఎస్ దృష్టిని రాష్ట్రం వైపు మరల్చడానికి సిఎస్ విషయాన్ని తెలుగుదేశం వాడుకుంటోంది. ఇక జగన్ తల్లి విజయమ్మ ఒత్తిడి మేరకే ఎల్వీని బదిలీ చేశారని వ్యాఖ్యానించడం మరో హాస్య౦. ఆమెకు ఎల్వీకి సంబంధం ఏముంటుంది...? కనీసం ప్రభుత్వంలో కూడా ఆమె భాగస్వామి కాదు. అదే విధంగా దేవాలయ భూములు అమ్మడానికి ఎల్వీ అడ్డుగా ఉన్నారని టీడీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని వేగవంతం చేసింది. మరి దీని కారణంగా ఏ విధంగా లబ్ది పొందుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: