ఏపీ ఎన్నికలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను, పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. కేంద్రం కూడా కరోనాను విపత్తుగా పేర్కొందని ఈసీ తెలిపింది. 
 
ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఈసీ తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలను గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న అనివార్య పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ నుండి ప్రకటన వెలువడింది. ఆరు వారాల తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. అత్యన్నత సమావేశం తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. 
 
ఏకగ్రీవంగా ఎన్నికైనవారు మాత్రం అలాగే కొనసాగుతారని ఈసీ స్పష్టం చేసింది. ఇప్పటికే పలు రాష్టాలలో స్కూళ్లు, థియేటర్లు బంద్ చేస్తున్నారని ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరైన నిర్ణయం కాదని ఈసీ తెలిపింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మీడియాతో ఎన్నికలను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఎన్నికల వాయిదా రాష్ట్ర రాజకీయ పార్టీలపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు లేదనే సమాధానం వినిపిస్తోంది. 
 
ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో మెజారిటీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవతున్నారు. మే నెల మొదటివారంలో లేదా రెండవ వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడం వల్ల పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.     

మరింత సమాచారం తెలుసుకోండి: