భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ... అనారోగ్యంతో బాధ పడుతున్న పేదలు ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేక నరకం అనుభవిస్తున్నారు. బీహార్ రాష్ట్రంలో మూడేళ్ల కుమారుడు ఆసుపత్రికి వెళ్లేందుకు వాహనాలు లేక తన తల్లి ముందే ప్రాణాలు విడవగా... ఆ తల్లి పడ్డ బాధ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి ఎన్నో సంఘటనలు దేశం మొత్తం జరుగుతున్న క్రమంలో తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ భర్త తన భార్యకు చికిత్స అందించడం కోసం ఏకంగా 17 గంటల 30 నిమిషాలలో 130 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేశాడు. ఆ భర్తకి తన భార్యపై ఉన్న ప్రేమ ప్రస్తుతం అందరినీ ఫిదా చేస్తుంది.


పూర్తి వివరాలు తెలుసుకుంటే... తమిళనాడులోని కుంభకోణం ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఓ గ్రామం లో దంపతులైన అరివాజగన్(65), మంజుల (60) నివసిస్తున్నారు. అయితే మంజులకు క్యాన్సర్ వ్యాధి రావడంతో ఆమె పుదుచ్చేరిలోని జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యువేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పటల్లో కీమోథెరపీ పొందుతుంది. మార్చి 31వ తేదీన తన భార్య కీమోథెరపీ సెషన్ కి హాజరవ్వాల్సి ఉంది. అయితే భారతదేశం అంతటా లాక్ టౌన్ లాక్ డౌన్ కొనసాగుతుండడంతో... తన భార్యను 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలించేందుకు పోలీసుల బెదిరింపులకు తాము తట్టుకోలేని చెబుతూ ఏ వాహన డ్రైవర్ ముందుకు రాలేదు.


దాంతో స్వయంగా అరివాజగనే తన భార్య మంజుల ను సైకిల్ కూర్చోపెట్టి ఆమె కింద పడిపోకుండా ఓ కండువా ని తనకి ఆమెకు కట్టుకొని 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పటల్ కి బయల్దేరాడు. ఉదయం పూట 4:45 గంటలకు బయలుదేరిన ఈ దంపతులు రాత్రి 10:15 గంటలకు ఆసుపత్రి కి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆసుపత్రి యాజమాన్యం మూసి ఉన్న తమ ఆసుపత్రిని తెరచి మరీ... అరివాజగన్ తన భార్య కోసం చేసిన పనిని మెచ్చుకుంటూ... ఆమెకు కీమోథెరపీ చికిత్సను అందించారు. అనంతరం వారిని ఒక ఆంబులెన్స్ లో ఎక్కించి ఇంటికి పంపించేశారు. ఏది ఏమైనా 65 ఏళ్ల వయసులో తన భార్యను ఎక్కించుకొని ఇక 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కడంటే... తనకి తన భార్య పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: