అరవింద్ కేజ్రీవాల్.. దేశ రాజకీయాల్లో విలక్షణ నేత. ప్రజలకు మేలు చేయాలన్న తపన ఆయన జీవితాన్ని అనేక మలుపులు తిప్పింది. సివిల్ సర్వీస్ ద్వారా తాను అనుకున్నది చేయవచ్చని ఆయన మొదట తలిచారు. పట్టుదలతో కష్టపడి చదివి సివిల్ సర్వీస్‌ లో చేరారు. అది ఆయనకు అంతగా తృప్తినివ్వలేదు. ఆయన భార్య కూడా ఓ సివిల్ సర్వీస్ అధికారి కావడం వల్ల ఆయన సమాజ సేవ కోసం ఉద్యోగాన్ని వదిలేశారు.

 

 

సామాజిక కార్యకర్తగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నించారు. ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఇప్పుడు మనకు హక్కుగా లభించిన సమాచార హక్కు చట్టానికి ఆయనే కారణం. సామాజిక కార్యకర్తగా ఆయన చేసిన సేవలకు రామన్ మెగసేసే అవార్డు కూడా వచ్చింది. కానీ.. ఆ మార్గం కూడా అరవింద్ కేజ్రీవాల్ కు అంతగా సంతృప్తి ఇవ్వలేదు.

 

 

లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో చేసిన పోరాటం అరవింద్ కేజ్రీవాల్ జీవితాన్ని మలుపు తిప్పింది. జనం మార్పు కోసం ఎంత తపిస్తున్నారో అర్థం చేసుకున్న అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థను మార్చగలమని నిర్ణయించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. మిగిలిన రాజకీయ పార్టీల్లా కాకుండా ఓ నమూనా పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని నిలబెట్టారు.

 

 

చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేస్తే.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా.. ప్రజలు ఆదరిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా దేశానికి చాటారు. ప్రజాస్వామ్యవాదులకు కొత్త ఊపిరిగా మారారు. తొలి ప్రయత్నంలో ఆయన విజయానికి అడుగు దూరంలో ఆగిపోయారు. అయినా కాంగ్రెస్ అండతో ముఖ్యమంత్రి అయ్యారు. సాధారణంగా ఇలాంటి వారిని మద్దతు ఇచ్చిన పార్టీలు కీ ఇచ్చిన బొమ్మల్లా ఆడుకుంటాయి.

 

 

కానీ ఆయన అరవింద్ కేజ్రీవాల్. అందుకే కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగలేదు. మెజారిటీ లేని అధికారం అవసరం లేదని కొద్దికాలంలోనే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఈసారి తిరుగులేని మెజారిటీతో 70 స్థానాలకు 67 స్థానాలు గెలుచుకుని దేశాన్ని నివ్వెరపరిచారు. ఆ తర్వాత ఐదేళ్లూ ఆదర్శవంతమైన పాలన అందించారు. స్కూళ్లు బాగు చేశారు. ఆసుపత్రులను జనం ముందుకు తెచ్చారు. సామాన్యుడి కష్టాలు తీర్చారు. అందుకే ఢిల్లీ జనం ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఇటీవల మరోసారి అధికారం కట్టబెట్టారు. సాధించినదానితో తృప్తిపడకుండా ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటూ విజయపథంలో సాగిన అరవింద్ కేజ్రీవాల్ ఈనాటి హెరాల్డ్ విజేత.

 

మరింత సమాచారం తెలుసుకోండి: