నిజానికి ప్రపంచంలో చాలా రకాల జీవరాశులు అంతరించిపోతున్నాయి ఎప్పుడు వింటూనే ఉంటాం. ఆనాటి డైనోసార్ తో మొదలు పెడితే నేటి చిన్నారి పిచ్చుకలు ఇలా అనేక జీవరాసులు మనిషి కంటికి కనిపించకుండా కనుమరుగువుతున్నాయి. ఇప్పుడు ఏ కొత్త జంతువు కనిపించినా దానిని మానవునికి కొత్త వింతలా ఉంటుంది. కాకపోతే కొన్ని జంతువులు ఎన్నో సంవత్సరాలుగా వాటి వృద్ధిని పెంచుకుంటూ వస్తున్నాయి. కాకపోతే, వాతావరణ మార్పులు, పర్యావరణం ఇంకా అడవులు తగ్గుదల లాంటి కారణాల వల్ల వాటి సంఖ్య రోజురోజుకు భూమి మీద తగ్గిపోతూ వస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే ఇప్పుడు ఇలానే త్రిపుర రాష్ట్రంలోని  సలేమా గ్రామంలో ఓ అరుదైన జంతువు పిల్లలు మనుషులకి కనిపించాయి. ఇక ఆ జంతువు పేరు హగ్ బ్యాడ్జర్.

 


నిజానికి ఈ పేరును నేటి వరకు చాలామంది విని ఉండరు బహుశా. ఇకపోతే ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది అందరికీ సుపరిచితమైన జంతువేనట. అయితే వీటి జాతి ఇప్పుడు కొద్దికొద్దిగా అంతరించి పోవడంతో ఎవరికి కనపడట్లేదని, నిజానికి ఈ జాతి జంతువులు ఆకృతి భలే విచిత్రంగా ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ఈ జంతువు ముఖం దగ్గర పంది మొఖం లాగ పోలి ఉంటుందని, అలాగే ఈ జీవిలో కిందనుంచి శరీరం మొత్తం ఎలుగుబంటి శరీరం వలె కనపడుతుంది. అంతేకాదు ఈ జీవిలో చాలా ప్రత్యేకతలున్నాయి అండి. ఈ జీవులు శాఖాహారం, మాంసాహారం రెండూ తీసుకొని జీవించగలవు. 

 

 

అలాగే ఈ జివి గరిష్ట బరువు  9 కిలోల నుంచి 10 కిలోల వరకు పెరుగుతాయని అటవీశాఖ అధికారులు తెలియచేసారు. ఇలాంటి అరుదైన జంతువులు అగర్తలా కు 90 కిలోమీటర్ల దూరంలో సలేమా గ్రామంలోకి ఎలా వచ్చాయో అటవీశాఖ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. అంతేకాకుండా వీటికి సంబంధించిన ఏవైనా జీవరాశులు ఇంకా ఏవైనా దగ్గరలో ఉన్నాయా అనే విధంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికి ఈ మూడు హగ్ బ్యాడ్జర్ పిల్లలను సెపహిజల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అధికారులు తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: