ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న టిడిపి అధినేత చంద్రబాబు కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మీద ఉన్న అక్కసుతో అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్న చంద్రబాబు దానిలో భాగంగానే సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు మంజూరు చేసిన మైనింగ్ లీజు వ్యవహారంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని, అనేక ఆరోపణలు చేశారు. అలాగే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు సైతం ఈ వ్యవహారంలో అనేక కథనాలు ప్రచురితం చేశాయి. ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండ్రస్ట్రీస్   వ్యవహారంలో ఎన్నో అక్రమాలు జరిగాయని, పదేపదే ఆరోపణలు చంద్రబాబు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. 

IHG

 


ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్ ఆంధ్రజ్యోతి, ఉషోదయ పబ్లికేషన్స్ ,ఈనాడు పత్రికలు ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డాయని ఆయన అన్నారు. ఈ తప్పుడు కథనాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని, ఈ మేరకు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు నోటీసుల ఇచ్చామని ఆయన పేర్కొన్నారు ఈ నోటీసులు అందిన వెంటనే వీరు స్పందించి క్షమాపణ చెప్పాలని, అలాగే ఆ పత్రికలు వార్తలు ప్రచురించే ముందు ప్రభుత్వం దగ్గర ఎటువంటి వివరణ తీసుకోకుండానే, వార్తలను ప్రచురించారని ఆయన అన్నారు. దీనిపై తాము ఇప్పుడు వారందరికీ లీగల్ నోటీసు ఇచ్చామని, వెంటనే క్షమాపణ చెప్పకపోతే, చట్ట పరంగా చర్యలు తీసుకుంటాము అంటూ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు.


ఈ వ్యవహారాన్ని పక్కనపెడితే ఇప్పటికే పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక వివాదాల్లో చిక్కుకుని జైలుపాలయ్యారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాంజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలుకు వెళ్లగా, ఇప్పుడు ఆ వరుసలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తో పాటు ఈఎస్ఐ కుంభకోణంలో మరో మంత్రి పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుల వ్యవహార శైలిపై నాతప్రభుత్వంలో నెలకొన్న అవినీతి అక్రమాలపై న వైసీపీ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది ఈ సందర్భంగా ఏవైనా అక్రమాలు జరిగినట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళుతుంది . సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు కు ఇప్పుడు నోటీసులు అనడంపై టిడిపి శ్రేణుల్లో ఆందోళనలను ఉంటుంది ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తున్న సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలా విమర్శలు చేసి చంద్రబాబు అనవసర వివాదాల్లో ఉంటున్నారంటూ వారు వాపోతున్నారు ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫైబర్ నెట్ వ్యవహారంలో పీకల్లోతు మునిగి నట్టుగా ప్రచారం జరుగుతోంది త్వరలోనే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో ప్రతి విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడం లేదనే విషయం అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: