ఆర్థిక లావాదేవీలు చివరకు హత్యలు వరకూ దారితీస్తున్నాయి. డబ్బు మనిషితో ఏ పనైనా చేయిస్తుంది అనడానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. రోజూ పేలర్ లలో ఆర్థిక  లావాదేవీలతో హత్యలు జరుగుతున్న వార్తలు చూస్తున్నాం. తాజాగా కడప జిల్లా రిటైర్డ్ ఉద్యోగి వెంకటరమణయ్య హత్య కేసు కూడా ఈ కోవలోకే వస్తుంది. డబ్బులు అప్పులు ఇచ్చి తిరిగి అడుగుతున్నాడనే అక్కసు తో మొండెం నుంచి తలను వేరు చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం ఎర్రగుంట లో వెలుగుచూసింది.

 

వివరాల్లోకి వెళ్తే....కడప జిల్లా ఏర్ర గుంటకు చెందిన వెంకటరమణయ్య ఐసీఎల్ లో రిటైర్డ్ ఉద్యోగి. వెంకటరమణయ్య అందరికి డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట అదృశ్యమైన ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి వెంటక రమణయ్య ఎర్రగుంట్ల మాజీ మున్సిపల్ చైర్మన్ ముసలయ్య ఇంట్లో శవమై తేలాడు. అతని మొండెం మాత్రమే ముసలయ్య ఇంట్లోని సంపులో లభ్యమైంది. అప్పు తీర్చమని ఒత్తిడి చేసినందుకే వెంకట రమణయ్యను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వెంకటరమణయ్య కన్పించడం లేదని ఈ నెల 22 వ తేదీన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.  ఆర్ధిక లావాదేవీల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ ముసలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు . ముసలయ్య ఇంట్లో మొండెం లేని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

 

 

మృతదేహానికి సంబంధించిన తలను కడప జిల్లాలోని గువ్వల చెరువుఘాట్ వద్ద లోయలో ఓ టిఫిన్ బాక్స్ లో గుర్తించారు. నిందితుడి ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు టిఫిన్ బాక్సులో మొండెం నుండి వేరు చేసిన తలను స్వాధీనం చేసుకొన్నారు.  డెడ్ బాడీ నుండి తలను వేరు చేసి ఇతర ప్రాంతానికి టిఫిన్ బాక్సులో తీసుకెళ్లడమంటే హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీలతోనే ఈ హత్య పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముసలయ్య వెంకటరమణయ్య వద్ద చాలా డబ్బులు అప్పు తీసుకున్నట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. వెంకటరామయ్య చాలా మందికి డబ్బులు అప్పు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు.

 

 

ఈ క్రమంలోనే డబ్బులు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముసలయ్య చెప్పిన చోటే టిఫిన్ బాక్సులో డెడ్ బాడీ తల లభ్యమైందని పోలీసులు చెప్పారు. అయితే ఈ హత్య కేసు విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఒక్కడే పాల్గొన్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఆధారాలు బయటకు వస్తే గాని ఎం జరిగింది అనేది తెలుస్తుంది అని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: