నిన్నటి వరకు టిక్ టాక్ అంటూ ఊగిపోయిన భారతీయులు నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చాలామంది నిరాశ చెందారు. కాకపోతే చైనా యాప్ కావడంతో ఎవరు దానిని వ్యతిరేకించలేదు. దీనితో స్వదేశీ యాప్ చింగారి యాప్ ను ఆదరించడం మొదలు పెట్టేశారు. చైనా యాప్స్ మనకొద్దు మన యాప్స్ ముద్దు అంటూ ఇప్పుడు అంత స్వదేశీ మంత్రాన్ని జపిస్తున్నారు దేశంలో. టిక్ టాక్ పై ఎంత అభిమానం ఉన్నా సరే దానిని వదిలేసి ఇప్పుడు అంత చింగారి పై పడ్డారు. 

 


నిజానికి కొద్ది రోజుల నుండి చింగారి యాప్ డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకీ క్రమంగా పెరుగుతోంది. అంతే కాదు నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిర్ణయాలతో టిక్ టాక్ బ్యాన్ కావడంతో వీటి సంఖ్య మరీ ఎక్కువ అయిపోయింది. చింగారి యాప్ భారతీయ వీడియో షేరింగ్ యాప్. ఈ యాప్ ఇప్పుడు ప్రజాదరణ బాగా పెరుగుతుంది. గత సంవత్సరంలో ఈ యాప్ లాంచ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఫోన్ ప్లే స్టోర్ లో ఏకంగా 2.5 మిలియన్ కు చేరుకుంది. కేవలం ఒక్క నెలలో లక్ష డౌన్ లోడ్ లోకి చేరుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు. బెంగుళూరు నగరానికి చెందిన బిస్వాత్మా నాయక్, మిస్టర్ సిద్ధార్థ గౌతమ్ అనే ఇద్దరు ప్రోగ్రామ్స్ ఈ స్వదేశి యాప్ ను డెవలప్ చేసి ప్లే స్టోర్ లో ఉంచారు.

 


వారం రోజుల క్రితం జరిగిన లడక్ సరిహద్దుల్లో చైనా జరిపిన దాడులకు గాను భారత ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రపంచంలో చైనా కు అతి పెద్ద బిజినెస్ అయిన ఆన్లైన్ మార్కెట్ కు చెక్కు చెప్పేందుకు భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో చైనా కు సంబంధించిన మొత్తం 58 యాప్స్ పై నిషేధాన్ని ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చింగారి యాప్ డౌన్లోడ్ చేసుకొని స్వదేశీ యాప్స్ ను ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: