రోజురోజుకీ ఆడపిల్లల జీవితాలు ప్రశ్నార్థకం గానే మారిపోతున్నాయి కామంతో కళ్లు మూసుకుపోయిన మనుషులు ఏకంగా ఆడ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్ళు మూసుకుపోయి ముగ్గురు కామాంధులు ఏకంగా ఒక అమాయకురాలైన బాలికను గర్భవతిని చేశారూ . ఈ దారుణ ఘటన తమిళనాడులోని వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది.



 దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే... తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లా కావలి పట్టణ శివారు కొండ పాలపర్తి ప్రాంతానికి చెందిన దంపతులకు 15 ఏళ్ల కుమార్తె ఉంది. పేదరికం కారణంగా సదరు బాలికను మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. మేనమామ ఇంట్లో పనులు చేస్తూనే మరోవైపు చదువు కూడా కొనసాగిస్తుంది సదరు బాలిక. ఈ క్రమంలోనే పక్కింట్లో ఉండే ఉదయానన్  అనే వ్యక్తి బాలిక పై కన్నేశాడు. ఎన్నో  మాయమాటలు చెప్పి బాలికను లొంగదీసుకుని  అనేకమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు..



 ఇక తర్వాత స్థానికాంగ ఉండే  రామరాజ్ అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిపోయింది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రియుడు ఆమెపై శారీరక వాంఛలు తీర్చుకున్నాడు . బాలిక ప్రేమ వ్యవహారం అందరికీ చెప్పేస్తానని బెదిరించి శక్తి అనే యువకుడు ఏకంగా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు . ముగ్గురు చేతిలో పది నెలల నుంచి నలిగిపోతునే  ఉంది సదరు బాలిక. ఇటీవలే కడుపునొప్పి రావడంతో బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గర్భవతి అని తేల్చారు. తల్లిదండ్రులు అబార్షన్  చేయాలంటూ వైద్యుల కాళ్ళ వేళ్ళ పడ్డారు . సమయం దాటిపోయింది అబార్షన్ చేయలేమంటూ వైద్యులు చెప్పడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: