కరోనా వైరస్ బారిన పడిన చాలామంది ప్రజలు కోలుకున్నారని కొన్ని ప్రముఖ సర్వేలలో తేలింది. ఆరోగ్యంగా, యవ్వనంగా ఉన్న మనుషుల్లో కరోనా వైరస్ అదంతట అదే తగ్గిపోయిందని ప్రముఖ డాక్టర్లు కూడా చెప్పారు. ఐతే కరోనా వైరస్ బారిన పడ్డామని చాలామందికి తెలియకుండానే నయమైపోతుంది అంటే అతిశయోక్తి కాదు. అయితే కొందరి రోగుల కారణంగా కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిలో తేలికపాటి లక్షణాలు ఉండటం వలన కరోనా వైరస్ వచ్చిందా లేదా అనేది మిగతా వారికి తెలియక పోవచ్చు. కరోనా వైరస్ వచ్చిందని చెప్పడానికి అనేక సూక్ష్మ సంకేతాలు సూచిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.


అకస్మాత్తుగా జ్వరం రావడం.. మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోవడం కరోనా వైరస్ సోకిందనడానికి సంకేతమని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా సోకితే జ్వరం తీవ్రత తక్కువగా(99-100 డిగ్రీలు) ఉంటుందంట. కరోనా బాధితులలోని 87 శాతం మందికి ఆకస్మాత్తుగా జ్వరం వచ్చిందట. జ్వరంతోపాటు వాసన, రుచి గుర్తించలేకపోవడం కూడా కరోనా వైరస్ సోకిందనడానికి ఒక సూక్ష్మ సంకేతమేనని నిపుణులు చెబుతున్నారు. పొడిదగ్గు రావడం కూడా కరోనా సోకిందనడానికి ఒక సూక్ష్మ సంకేతమేనని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా పీడితుల లో కండ్లకలక లు కూడా వస్తాయట. చర్మంపై అక్కడక్కడ దద్దుర్లు కూడా ఏర్పడతాయట.


కోవిడ్-19 వ్యాధి వచ్చిన వారికి ఊపిరాడకపోవడం.. చాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇటువంటి రోగులు వెంటనే వైద్యులను సంప్రదించడం మేలని డాక్టర్లు చెబుతున్నారు. ఉన్నఫలంగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఇబ్బందులు ఏర్పడినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం శ్రేయస్కరం అని డాక్టర్లు చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి యాంటీబాడీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా నిర్ధారించవచ్చు. కరోనా వైరస్ విజృంభించి ఇప్పటికే ఏడాది కాలం గడుస్తుండగా.. ప్రస్తుతం భారతదేశంలో తేలికపాటి లక్షణాలతో కరోనా వైరస్ ప్రజలను బాధిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చలికాలం పూర్తికాగానే కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: