తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలకోసం అన్నిపార్టీ లు సిద్ధమవుతున్నాయి.. ప్రచారాల జోరును హోరెత్తిస్తున్నాయి. వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎన్నికలను ముందే పెట్టి ప్రతిపక్షాలకు పెద్ద షాక్ ఇచ్చారని చెప్పొచ్చు.. అంతకుముందు దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు..  అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ..

అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు.. ఇప్పటికైనా సర్దుకోకపోతే ఆంధ్ర లో టీడీపీ కి పట్టిన గతి పడుతుందని అన్నారు.. అయితే గ్రేటర్ లో కేసీఆర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. నిన్న ప్రకటించిన మేనిఫెస్టో లో ప్రజలకు లబ్ది చేకూరే పథకాలు ఎన్నో ఉన్నాయి.. ఇక బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇక్కడ టీడీపీ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..

ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడు లేని విధంగా పుంజుకున్న బీజేపీ పార్టీ కేసీఆర్ ని తొక్కేసేవిధంగా ప్లాన్ చేస్తుంది.. అందరు కేంద్ర నేతలు కలిసి రావడం చూస్తుంటే ఎక్కడ కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ కి వచ్చి తమకు ఇబ్బందిగా మారుతాడా అని భయం వారిలో నెలకొన్నట్లు ఉంది. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఎవరికీ స్కోప్ లేదు. మొత్తం మోడీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనను ఎదిరించిన ఎవరైనా.. ఆయారాష్ట్రాల్లో బీజేపీకి బలం లేకపోయినా.. అధికారం కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తోంది. అన్ని చోట్లా అదే జరిగింది. అందుకే.. చాలా మంది ప్రాంతీయ పార్టీల నేతలు ఆయన ప్రాపకం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ కూడా.. నిన్నామొన్నటిదాకా అంతే. ఇప్పుడే ఆయన జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ గురించి విమర్శులు చేస్తున్నారు. అప్పుడే ఆయన బీజేపీ తనను టార్గెట్ చేసిందని చెప్పుకోవడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: