ఈ మధ్య కాలం లో బంధాల కు బంధుత్వాల కు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే... క్షణకాల సుఖం కోసం బంధాలు బంధుత్వాలు మరుస్తున్న ఎంతోమంది ఎవరికి దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూనే ఉన్నాయ్. ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యం లో జరుగుతున్న దారుణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తుల మోజు లో పడుతున్న ఎంతో మంది చివరికి దారుణాల కు పాల్పడుతున్నారు.



 అక్కడ ఇలాంటి దారుణం ఘటన  జరిగింది. అన్నా అన్నా అంటూ ఇంటికి తరచూ వస్తూ ఉండే యువతే ఏకంగా సవితి గా మారిపోయింది. ఓ రోజు భార్య భర్త ఫోన్ చెక్ చేయడంతో అసలు విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన జనగామ జిల్లా ఆలేరు లో చోటుచేసుకుంది.  యువకుడు 10 సంవత్సరాల క్రితం ఆ యువతిని పెళ్ళిచేసుకున్నాడు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇక భార్య పై మోజు తీరడం తో పరాయి మహిళపై కన్నేసాడు సదరు వ్యక్తి.



 ఆరు నెలల క్రితం  ఇంటి పక్కనే ఉంటున్న యువతితో వివాహేతరా సంబంధానికి తెరలేపాడు. అయితే ఆ యువతి ఎవరో కాదు స్వయానా వ్యక్తి యొక్క చిన్నమ్మ కూతురు. నిత్యం అన్న అన్న అంటూ ఇంటికి వస్తూ ఉండేది. కానీ చివరికి ఒకరోజు భర్త ఫోన్ ని భార్య చెక్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడంతో ఇద్దరు అక్రమ సంబంధం ప్రభుత్వ బట్టబయలు అయ్యింది. ఆ తర్వాత భార్యను వదిలేసి సదరు యువతి తో పారిపోయాడు సదరు వ్యక్తి. తనకు న్యాయం చేయాలి అంటూ బోరున విలపిస్తూ ఉంది బాధితురాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: