ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటి వరకూ తక్కువగా ఉన్న కేసులు మరో సారి విజృంభిస్తుండడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు అయితే గత ఏడాది ఇదే సమయంలో  లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదు అయినప్పుడు ఇక  దేశ ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతికారు. ఇప్పుడు అంతకు మించి అనే రేంజ్ లో ఏకంగా వైరస్ కేసులు డబుల్ అవుతున్నాయి. ప్రతి రోజు కూడా మూడు లక్షలకు పైగా  వైరస్ కేసులు నమోదు ఉండడం అందరినీ ఆందోళన కలిగిస్తుంది.


 అంతేకాకుండా ఒకప్పుడు వైరస్ వచ్చినప్పటికీ కూడా ఇక హోమ్ క్వారంటైన్ లో  ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే తగ్గిపోయింది. కానీ నేటి రోజుల్లో మాత్రం వైరస్ బారిన పడిన తర్వాత ఎక్కువ మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉండడంతో  ఎక్కువగా ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఈ కరోనా వైరస్ రోగులకు వివిధ రకాల మందుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటికే  వైరస్ కి చికిత్స అందించడానికి పలు రకాల మందులు ఉపయోగిస్తూ ఉండగా ఇటీవలే  వైరస్ చికిత్స కోసం మరో కొత్త ఔషధాన్ని తయారు చేశారు.




 జైడిస్ అనే సంస్థ కరోనా వైరస్ చికిత్స కోసం వీరాఫిన్ అనే ఔషధాన్ని తయారుచేసింది. ఈ ఔషధానికి అటు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మధ్యస్థ కరోనా వైరస్ లక్షణాలు ఉన్న రోగుల కోసం ఔషధాన్ని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరాఫిన్ ఔషదం  సింగల్ డోస్ తోనే కరోనా వైరస్ కు చెక్ పెట్టే సామర్థ్యం కలిగి ఉంది అని అంటూ వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇక మరికొన్ని రోజుల్లో ఈ ఔషదం వాడుకలోనికి రానున్నట్లు సమాచారం. ఇక వాడుకలోకి వచ్చిన తర్వాత ఈ వైరస్ కరోనా వైరస్ చికిత్సలో పనిచేస్తుంది అన్నది అందరికీ తెలియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: