ఇక్కడ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది బ్లాక్ ఫంగస్. ఇటీవలే ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపాలి అని అనుకున్నాడు. కానీ అంతలో కరోనా వైరస్ పంజా విసిరింది. కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ధైర్యం కోల్పోకుండా వైరస్ ను జయించాడు. కానీ ఆ తర్వాత సోకిన బ్లాక్ ఫంగస్ బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో వెలుగులోకి వచ్చింది. యాంనం పేటకు చెందిన నక్క రాజేష్ యాదవ్ అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఎంతో కష్టపడి పెద్దలను ఒప్పించి మరీ ఇక అందరి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇక ప్రేమించిన యువతితో పెళ్లి.. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో అంతా సాఫీగా సాగిపోతుంది. అంతా ఆనందంగా సాగిపోతున్న తరుణంలో కరోనా వైరస్ అతనిపై పంజా విసిరింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో నెల రోజుల పాటు చికిత్స ఇక కరోనా వైరస్ బారి నుండి కోలుకున్నాడు. కానీ అతనికి కరోనా వైరస్ గురించి కోలుకున్న ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. అంతలోనే బ్లాక్ ఫంగస్ ఎటాక్ చేసింది. ఇక కొద్ది రోజుల్లోనే అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చేరి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. లక్షలు ఖర్చు పెట్టిన రాజేష్ ప్రాణం మాత్రం దక్కలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి