సాధారణంగా సీజన్ మారుతుంది అంటే చాలు వాతావరణంలో ఎన్ని రకాల మార్పులు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇలాంటి నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ సీజన్ మారగానే ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా ఎండాకాలంలో ఆహారపు అలవాట్లకు వర్ష కాలంలో ఆహారపు అలవాట్ల ఎంతో తేడా ఉంటుంది. అటు వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.  అందుకే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించకపోతే చివరికి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.




 ముఖ్యంగా వర్షాకాలంలో ఎప్పుడు వాతావరణం కూల్ గా ఉంటుంది కాబట్టి కొన్ని రకాల ఆహారాల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.  సాధారణంగా వర్షాకాలంలో కాస్త వర్షం పడి ఇక వాతావరణం మొత్తం చల్లబడి పోయింది అంటే... అందరికీ మొదట మనసులో మెదిలే ఆలోచన ఏంటి..  కూల్ కూల్ వెదర్ లో హాట్ హాట్ పకోడీ బజ్జీలు తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో అని అనుకుంటారు అందరూ.  ఇక అనుకున్నదే తడవుగా దగ్గరలో ఉన్న బజ్జీల బండి దగ్గరికి వెళ్లి నూనెలో వేయించిన వేడివేడి బజ్జీలు లాగిస్తూ ఉంటారు. ఇలా ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు.


 అయితే వర్షాకాలంలో బజ్జీలు తినడం అప్పుడప్పుడు ఓకే కానీ తరచు బజ్జీలు తింటే మాత్రం అజీర్తి సమస్యలతో బాధ పడటం ఖాయం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బజ్జీలు తినడం వల్ల మలబద్ధకం అజీర్తి లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అదే సమయంలో ఇక ఎండాకాలంలో పెరుగును లాగించిన వారు వర్షాకాలంలో మాత్రం పెరుగును దూరం పెట్టడం మంచిది అని చెబుతున్నారు. పెరుగు తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,ఊపిరితిత్తుల సమస్య, అలర్జీ లాంటివి వస్తాయట.  సైనసైటిస్ సమస్య ఉంటే పెరుగును దూరం పెట్టడం మరింత మంచిది అని సూచిస్తున్నారు. ఇక ఎక్కడపడితే అక్కడ నీరు తాగకుండా జాగ్రత్త వహించాలని.. అంతేకాకుండా ఐస్ క్రీమ్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: