ప్రస్తుతం భారతదేశాన్ని పాలిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఏకపక్షంగా వ్యతికరేకించడం బహుశా ఇదే మొదటిసారేమో అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మోదీ సైతం కరోనా సమయంలో సరైన మార్గదర్శకాలు పాటించక దేశం ఎంతో ఇబ్బంది పడింది. విదేశీయులు కూడా మోదీ అసమర్ధతను ప్రశ్నించిన వైనం భారతదేశ ప్రజలను తలదించుకునేలా చేసింది. ఇప్పుడు మళ్ళీ మోదీ రానున్న ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే కేంద్ర కేబినెట్ ను విస్తరించి అన్ని రాస్టర్లను సమానంగా చూస్తున్నాను అనే భావన కలగడానికి మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇందులో ఉత్తరప్రదేశ్ కి అగ్రస్థానం ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ గెలవడానికి గల అవకాశాలను మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. 

ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉదయమే కర్ణాటక సీఎం యడ్డ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాల పట్ల ఇతర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అయితే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని మీడియాలో వస్తున్న వార్తలు చెబుతున్నాయి. కానీ యడ్యూరప్ప ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉన్నా, ఇంత త్వరగా ఎందుకు దిగిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే వయసు మీద పడిన కారణం చేత యడ్డీని తొలగించినట్లు కూడా తెలుస్తోంది. రాబోయే ఎన్నికలలో పార్టీని బలోపేతం చేయడానికి గల వనరులను కేంద్రం సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రక్రియలో భాగంగానే పోటీతత్వం కలిగిన నేతకు సీఎం పగ్గాలు అప్పగిస్తారన్న మాట వినబడుతోంది.

అయితే ఇందులో యడ్డీకి స్వార్థపరమైన ఆశ ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మోదీ మరియు అమిత్ షా లు యడ్డీకి భవిష్యత్తుపై పూర్తి భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే యడ్డీ గవర్నర్ కానున్నారని కూడా తెలుస్తోంది. యడ్డీకి కూడా గవర్నర్ కావాలనే ఆశ బలంగా ఉన్నట్లు వినపడుతోంది. మరి యడ్డీ ఆశ తీరుతుందా ? లేదా ఇంతటితో యడ్డీ రాజకీయ జీవితానికి మరియు బీజేపీతో ఉన్న బంధానికి చరమగీతం పెడుతారా అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: