ప్రస్తుతం యువతను పట్టి పీడిస్తున్న దెయ్యం డ్రగ్స్. ఈ డ్రగ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. స్నేహితుల ముసుగులో లేదా ఇతరత్రా వినోదాల వలలో పడుతున్న యువత ఈ డ్రగ్స్ కు బానిసలుగా మారిపోతున్నారు. డ్రగ్స్ లేకుంటే చనిపోయేంత స్టేజ్ కు వీరు చేరుకుంటున్నారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ డ్రగ్స్ కు అలవాటు పడిన వారు వేసుకుకున్న ప్రమాదమే లాగ్ని వేసుకున్న ప్రమాదమే. మానవాళికి ఇంత హాని కలిగిస్తున్న ఈ డ్రగ్స్ లో చాలా రకాలున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం చాలా ప్రమాదకరమని తెలుస్తోంది. అవేమిటో ఒకసారి చూద్దాం.

గంజాయి

ఈ మాదకద్రవ్యము మనిషిని ఉత్తేజింపచేస్తుంది. గంజాయిని ఎక్కువ కాలం వాడుతూ ఉండడం కారణంగా ఆందోళన మరియు నిరాశను కలిగిస్తుందని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు.

MDMA

MDMA కూడా మనిషిని ఉల్లాసంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుఇదైతే ఒక పరిధి ధాటి తీసుకున్తామో అప్పుడు చాలా ప్రమాదంగా మారుతుంది. అంతే కాకుండా దీనిని మధ్యంలో కలిపి తీసుకుంటే అత్యంత రామాదకరమని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా నాడీ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తీవ్రతను చూపుతుందని తెలుస్తోంది. అయితే దీనిని బయట చాలా దేశాలలో నిషేధించారు.

కెతమినె

ఇది కూడా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ గా గుర్తించబడింది. ఈ డ్రగ్ ను తక్కువ పరిమాణంలో తీసుకున్న ప్రమాదమేనని తెలుస్తోంది. ఇది తీసుకున్న వారికి మెల్ల మెల్లగా  మతి మెరుపు వస్తుంది.

క్రిస్టల్ మీథేన్

ఈ డ్రగ్ అసలు ప్రపంచంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఎప్పుడైతే "బ్రేకింగ్ బాడ్" అనే వెబ్ సిరీస్ టెలికాస్ట్ అయిందో అప్పుడే దీని గురించి అందరికీ తెలిసిపోయింది. ఇది ఎక్కువగా మెదడు పై తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది దీర్ఘ కలం వాడడం మూలంగా జ్ఞాపక శక్తికి సంబంధించిన ససమస్యలు ఉత్పన్నం అవుతాయి.  

కొకైన్

ఒక్క మాటలో చెప్పాలంటే కొకైన్ అనేది అన్ని పార్టీలలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో దీని హవా ఎక్కువగా ఉంది. దీనికి అలవాటు పడినవారు మరిచిపోవడం కుదరని పని. కొకైన్ తీసుకున్న తర్వాత డోపామైన్ ను ఎక్కువ శాతంలో విడుదల చేస్తుందని డాక్టర్స్ చెబుతున్నారు. ఇది కూడా మెదడుపై తన ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తోంది.

ఆల్కహాల్

ఆల్కహాల్ అనేది అందరికీ తెలిసిన డ్రగ్. దీని వలన కూడా భారీ నష్టాలు ఉంటాయి.  మనకున్న అన్ని మత్తు మందులలో ఇది అత్యంత ప్రమాదకారి అని చెబుతున్నారు.

పొగాకు

దీని ప్రభుత్వాలు కూడా బ్యాన్ చేయకుండా ఉన్నాయి. బహుశా దీని వలన ఎక్కువగా లాభాలు వస్తాయి కాబట్టే ఇప్పటి వరకు దీనిని చట్ట విరుద్ధంగా ప్రకటించలేదు. దీని కారణంగా ప్రపంచంలో ఎంతోహామంది తమ ప్రాణాలు;అను కోల్పోయారు. పొగాకు గంజాయి కంటే చాలా ప్రమాదమని తెలుస్తోంది.

ఇవే మానవునికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇవే కాకుండా విదేశాలలో ఇంకా మనకు తెలియని ఎన్నో డ్రగ్ రకాలు ఉన్నాయి. మరి ఎప్పటికి ఈ డ్రగ్స్ అన్నింటినీ బ్యాన్ చేసి యువతను ప్రభుత్వాలు రక్షిస్తాయో తెలియడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: