ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వీరాభిమాని.. ఆయ‌న‌కు ప్రియ‌మైన నాయ‌కుడు.. మంత్రి.. ఆదిమూల‌పు సురేష్‌కు ప‌ద‌వీ గండం పొంచి ఉందా?  ఆయ‌న చుట్టూ.. సీబీఐ ఉచ్చు బిగుస్తోందా?  అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. త్వ‌ర‌లోనే సురేష్ దంప‌తుల కేసులో సీబీఐ దూకుడు చూపిస్తుంద‌ని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం  విద్యాశాఖ మంత్రిగా ఉన్న సురేష్‌.. గ‌తంలో ఐఆర్ ఎస్ అధికారి. ఆయ‌న స‌తీమ‌ణి కూడా ఐఆర్ ఎస్ అధికారి. వైఎస్ హ‌యాంలోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సురేష్‌.. త‌న ఐఆర్ ఎస్ ప‌ద‌వికి రిజైన్ చేశారు.

అయితే.. ఆయ‌న స‌తీమ‌ణి.. విజ‌య‌ల‌క్ష్మి మాత్రం అధికారిగా ఉన్నారు. అయితే.. 2016-17 మ‌ధ్య దేశంలో ఐఆర్ ఎస్ అధికారుల ఆదాయంపై కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని.. స‌ర్వీసు స‌మ‌యంలో అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. దేశ‌వ్యాప్తంగా వంద మందికి పైగా ఐఆర్ ఎస్ అధికారుల‌పై అందిన ఫిర్యాదుల్లో సురేష్ దంప‌తులు కూడా ఉన్నారు. దీంతో 2017లో సీబీఐ వీరి ఇంటిపై దాడులు చేసి.. ఆదాయానికి మించి 4 కోట్ల రూపాయ‌ల పైచిలుకు ఆస్తులు ఉన్న‌ట్టు గుర్తించి కేసు న‌మోదు చేసింది. అయితే.. దీనిని సురేష్ దంప‌తులు.. తెలంగాణ హైకోర్టులో స‌వాల్ చేశారు.

దీనిని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అయితే.. సీబీఐ మాత్రం ఈ కేసును సుప్రీం కోర్టులో స‌వాల్ చేసింది. దీంతో తాజాగా కేసును విచారించిన సుప్రీం కోర్టు మ‌ళ్లీ ఫ్రెచ్‌గా ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసి.. సురేష్ దంప‌తుల‌పై కేసు విచార‌ణ‌ను కొన‌సాగించాల‌ని ఆదేశించింది. దీంతో సీబీఐ మ‌ళ్లీ రంగంలోకి దిగింది. ప్ర‌స్తుతం వీరి స‌ర్వీసు రికార్డులు స్వాధీనం చేసుకుని.. ఆస్తుల‌ను మ‌దింపు చేస్తోంది.

అవినీతి నిరోధ‌క చ‌ట్టం.. కేంద్రం నిబంధ‌న‌ల మేరకు.. సురేష్ క‌నుక త‌న స‌ర్వీసులో.. అక్ర‌మాలు చేసి ఉన్న‌ట్టు సీబీఐ తేల్చితే.. ఆయ‌న కు ప‌ద‌వీ గండం ఖాయ‌మ‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. ఈ కేసు తేల్చ‌డానికి మూడు నెల‌ల మాత్ర‌మే స‌మ‌యం ఉంద‌ని చెబుతున్నారు. దీంతో సురేష్ కుటుంబంలో ఈ వివాదం ర‌చ్చ‌గా మారింది. ఏదేమైనా జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ క‌స్తుడిగా ఉండ‌డంతో పాటు ప్ర‌కాశం జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న సురేష్ ఇప్పుడు ఈ ప‌రిస్థితుల్లో ఇలా చిక్కుకోవ‌డం వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: