కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు  ఇలా ఎవ‌రైనా త‌మ‌కు  ఏదైనా అన్యాయం  జరిగిన‌ప్పుడే కార్యాలయాల్లో పని పూర్తిగా ఆగిపోయేలా చేస్తుంటారు. వారి డిమాండ్‌లు నెర‌వేర్చుకునేందుకు పోరాడుతుంటారు. అదేవిధంగా ఈ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌లకు కూడా తమ ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యాయట.  దీంతో వారు  వినూతనంగా నిరసనలు చేపట్టారు. ఇటలీలోని కాంపిడోగ్లియోలో సుమారు 50 మంది ఎయిర్ హోస్టెస్‌లు బట్టలు విప్పి రోడ్డు మీదకు వచ్చి  నిరసన చేపట్టారు.  త‌మ‌కు వ‌చ్చే జీతంలో కోత‌లు,  ఉద్యోగాల నష్టంపై మనస్తాపం చెందారు. దీంతో   తాము నిరసన చేపట్టామని అక్క‌డి మీడియాకు వెల్లడించారు.

ఇట‌లీలో అలాటియా ఎయిర్‌లైన్స్ తాజాగా ఐటీఏ ఎయిర్‌వేస్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఈ పరిణామం అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.  అలిటాలియా ఎయిర్‌లైన్స్ సుమారుగా 10,500 మంది ఉద్యోగులను నియమించుకున్న‌ది.  కానీ  ఐటీఏ ఎయిర్‌వేస్‌లో మాత్రం కేవలం 2,600 మంది మాత్ర‌మే  ఉద్యోగాలు  పొందగలిగారని స‌మాచారం.  మరోవైపు ఐటీఏ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఉద్యోగి..  సీనియారిటీ ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు మాకు ద‌క్క‌లేదు. సాల‌రీలు  కూడా చాలా  తగ్గించారు. ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెల‌కొంది. దీంతో  సందిగ్థంలో ఉన్నామని ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.

ఇట‌లీలో అలిటాలియా ఎయిర్ లైన్స్‌కు చెందిన 50 మంది ఎయిర్ హోస్ట్‌లు అర్ధ‌న‌గ్నంగా నిర‌స‌న చేప‌ట్టారు. రోమ్ న‌గ‌రంలోని టౌన్ హాల్ ముందు త‌మ యూనిఫాంలు విప్పి ఆందోళ‌న  నిర్వ‌హించారు. జీతంలో కోత‌లు, ఉద్యోగాలు తొల‌గించ‌డంపై మ‌న‌స్తాపం చెందిన‌ట్టు  తెలుపుతున్నారు ఉద్యోగులు. చాలా మంది ఉద్యోగుల‌ను ప‌క్క‌కు పెట్టడంతో ఏటీఏపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌నకు దిగారు.  ఐటిఏ  ఎయిర్‌వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లా స్పందిస్తూ..  ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేశారు.  ఉద్యోగులు సమ్మె చేస్తారని నేను అస‌లు భావింలేదు. అలా చేస్తే  వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని  ఆయ‌న మీడియాకు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: