ఏపీలో  ఎమ్మెల్యేల కోటాలో  మూడు ఎమ్మెల్సీల ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు  కేంద్ర ఎన్నికల సంఘం వాళ  నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వైసీపీ నుంచి  డిసి. గోవిందరెడ్డి, బీజేపీ నుంచి  సోము వీర్రాజు, టీడీపీ నుంచి  మహమ్మద్ షరీఫ్ ప‌దవీ కాలం ముగియ‌డంతో  వారి స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీల‌ను ఎంపిక చేసేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ అదిరిపోయే  స్ట్రాట‌జీ ప్లే చేసిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మూడు ఎమ్మెల్సీ లు  కూడా అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి.

ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు  కు చెందిన మాజీ  ఎమ్మెల్యే.. తాజా మాజీ ఎమ్మెల్సీ  డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్యేల కోటాలో  ఎమ్మెల్సీగా  కొనసాగించే యోచనలో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. గోవింద రెడ్డి ఇటీవ‌లే బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. ఆయ‌న స్వ‌గ్రామం కడప జిల్లా  బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల. ప్ర‌స్తుతం ఆయ‌న బ‌ద్వేల్ వైసీపీ ఇన్ చార్జ్‌గా ఉన్నారు.

ఇక జ‌గ‌న్ ఓ ఓసీ క్యాండెట్ కు, మ‌రో బీసీ, మ‌రో ఎస్సీకి ఈ ప‌ద‌వులు ఇవ్వాల‌ని ప్లాన్ చేశార‌ట‌. ఎస్సీ  మాదిగ ఈక్వేషన్  కోటాలో లబ్బి వెంకటస్వామికి పార్టీ అధిష్టానం  ఇవ్వొచ్చని వార్త‌లు వ‌స్తున్నాయి. వెంక‌ట స్వామి స్వగ్రామం కర్నూలు జిల్లా  శ్రీశైలం నియోజకవర్గం  వెలుగోడు మండలం  అబ్దుల్లాపురం  గ్రామం. వెంక‌ట స్వామి పాములపాడు  మండలం నుంచి  జెడ్పిటిసిగా  గెలుపొంది  జడ్పీ చైర్మన్  అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న గ‌తంలో ఓ సారి ఎమ్మె ల్యే గా కూడా ప‌ని చేశారు.

ఇక ఈ సారి ఎస్సీ కోటా నుంచి మాదిగ వ‌ర్గానికి చెందిన ఓ నేత‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని తెలుస్తోంది. మాల కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ లు ఉండ‌డంతో మాదిగ‌ల‌కు ప్రాధాన్య‌త పెంచుతున్నార‌ట‌. ఏదేమైనా జ‌గ‌న్ క్యాస్ట్ స్ట్రాట‌జీలు మాత్రం ఈ సారి మామూలు గా లేవ‌ని ఆ పార్టీ నేత‌లు అంత‌ర్గ‌తం గా చ‌ర్చించు కుంటున్నా రు.

మరింత సమాచారం తెలుసుకోండి: