మొన్నటి వరకు సైబరాబాద్ సిపి గా కొనసాగారు సజ్జనార్. ఈ క్రమంలోనే నేరాల నియంత్రణకు ఎంతో దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు. నేరస్తులు అందరినీ గడగడలాడించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించిన సీపీ సజ్జనార్.. ఇటీవలే ఏకంగా ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలను చేపట్టారు. అయితే ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రోడ్డు రవాణా సంస్థను ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు సీపీ సజ్జనార్.


 ఇప్పటివరకూ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీపీ సజ్జనార్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఒకవైపు సంస్థను లాభాలా పట్టించేలా నిర్ణయాలు తీసుకోవడమే కాదు మరోవైపు రోడ్డు రవాణా సంస్థ ప్రజలందరికీ చేరువ చేసే విధంగా కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు ప్రయాణికుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుని ఆర్టీసీ ప్రయాణికులకు అందరికీ కూడా శుభవార్త చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. సాధారణంగా రాత్రి ప్రయాణం చేస్తున్న సమయంలో అత్యవసరాలకు వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడి పోతూ ఉంటారు.


 కానీ ప్రయాణికులు అందరికీ కూడా ఇబ్బందులు తప్పించేందుకు ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రివేళల్లో ప్రయాణికులు అత్యవసరం అని చెబితే బస్సు ఆపవచ్చు అంటు ఉత్తర్వులు జారీ చేశారు. టోల్ ప్లాజాల వద్ద గదులు వినియోగించుకోవచ్చు అని తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. రాత్రివేళ ప్రయాణాలు అత్యవసరాలు కు వెళ్లాలి అంటే ఇబ్బంది పడుతున్నట్లు ఒక ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం దాబాలు హోటల్ వద్ద బస్సు నిలపాలి అనీ తెలిపారు సీపీ సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి: