ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి అని ప్రతి ఒక్కరూ ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇలా దేవుడికి పూజ చేసి దీపాలు వెలిగించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇలా దీపాలు వెలిగించడం ఇక్కడ ఇద్దరు దంపతులు ప్రాణాలు పోవడానికి కారణం అయింది. కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడానికి వెళ్లిన దంపతులు ఇద్దరూ కూడా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కర్నూలులో వెలుగులోకి వచ్చింది.
దీపాలు వెలిగించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ఇద్దరు భార్యాభర్తలు కాలువలో పడి మృతి చెందారు. కర్నూలులోని అబ్బాస్ నగర్ లో రాఘవేంద్ర ప్రసాద్, ఇందిరా అనే భార్య భర్తలు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కార్తీక పౌర్ణమి కావడంతో రాఘవేంద్ర ప్రసాద్ దంపతులు ఇటీవలే వినాయక ఘాట్ వద్ద కేసీ కాల్వ పక్కనే ఉన్న గుడికి వెళ్లారు. ఇందిరా కాలువ లో దీపం వదిలేందుకు వెళ్లారు. దీంతో అదుపుతప్పి అందులో పడిపోయారు. అయితే భార్య ను కాపాడేందుకు వెళ్లిన భర్త రాఘవేంద్ర ప్రసాద్ కాలువలో పడిపోయారు. దీంతో స్థానికులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రవాహం ఉదృతంగా ఉండటం తో చివరికి ఇద్దరు కొట్టుకుపోయారు. చివరికి ఘటనా స్థలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో వీరి మృతదేహాలనులభ్యమయ్యాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి