అమరావతి : కోర్టు పరిధి నుంచి తప్పించుకునేందుకే మూడు రాజధానుల చట్టాన్ని తాత్కాలికంగా రద్దు చేశారని.. అమరావతి విషయంలో సీఎం జగనుకు చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు  ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. తన అంతరాత్మను టేబుల్ మీద పెట్టి జగన్ అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు సోము వీర్రాజు. అబద్దాలు ఆడేందుకు.. బూతులు మాట్లాడేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు సోము వీర్రాజు. రాయలసీమ మీద సడెనుగా జగనుకు ప్రేమ పుట్టుకొచ్చిందా..? ఈ రెండున్నరేళ్ల కాలంలో సీమకు చెందిన హంద్రీ-నీవా ప్రాజెక్టును జగన్ ఎందుకు పూర్తి చేయలేదు..? అని నిలదీశారు సోము వీర్రాజు. 

వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయా..? విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహరం ఇచ్చి.. వరద బాధిత కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలే ఇస్తారా..? అని ప్రశ్నించారు సోము వీర్రాజు. సీఎం ఇప్పటి వరకు ఎందుకు పర్యటించలేదు.. ఏరియల్ సర్వే చేయడం కాదని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు.. వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి పెద్ద కాంట్రాక్టర్.. భారీగా ప్ర భు త్వం నుంచి కాంట్రాక్టులు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు .ఎమ్మెల్యే మేడా వెళ్లి బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తారా..? ఏం మనస్త త్వం ఇ ది..? అని ప్రశ్నించారు.  అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది కాబట్టి.. మళ్లీ దాన్ని నిర్మించే కాంట్రాక్టు కూడా మేడానే తీసుకుంటారేమో..? ఇసుక మాఫియా కోసమే పించా, అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు ఎత్త లే  ద న్నా రు సో ము వీ ర్రా జు. అందు కే  అ న్న మ య్య ప్రా జెక్టు కొట్టు కుని పోయిందన్నారు. పంట నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపాలన్నారు సోము వీర్రాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: