ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీకి ఎంత కంచుకోట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఆ పార్టీకి ఇక్కడ మెజార్టీ సీట్లు కట్టబెడుతూ వస్తున్నారు. 1994 ఎన్నికల్లో జిల్లాలో అన్ని సీట్లు టిడిపి స్వీప్‌ చేసేసింది. 1999 ఎన్నికల్లో కొవ్వూరు సిటు మినహా అన్ని చోట్ల టిడిపి విజయం సాధించింది. పార్టీ ఓడిపోయిన 2004 - 2009 ఎన్నికల్లో కూడా జిల్లాలో తెలుగుదేశం నాలుగు నుంచి ఐదు సీట్లలో విజయం సాధించింది.

ఇక 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా స్వీప్ చేసింది. వైసిపి ఒక్కటంటే ఒక్క చోట‌ కూడా విజయం సాధించలేదు. అలాంటి జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బలు తగిలాయి. జిల్లాలో పాల‌కొల్లు, ఉండి అసెంబ్లీ సీట్లు మిన‌హా మిగిలిన అన్ని ఎమ్మెల్యే సీట్ల తో పాటు ఎంపీ సీట్ల‌లో టిడిపి చిత్తుగా ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ కంచుకోట లు కూడా బ‌ద్ద‌లయ్యాయి.

స్థానిక సంస్థల ఎన్నిక్లో కూడా వైసీపీ తన ఆధిపత్యం చాటుకుంది. అలాంటి జిల్లాలో రెండున్నర సంవత్సరాలకే పార్టీ పరిస్థితి రివ‌ర్స్‌ అవుతుంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల ఘోరమైన పనితీరు తోపాటు నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగకపోవడం... ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో జిల్లా ప్రజలందరూ తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు.

ముఖ్యంగా తాడేపల్లి గూడెం - చింతలపూడి - దెందులూరు - తణుకు - పోలవరం - కొవ్వూరు - నిడదవోలు ఆచంట - ఏలూరు లాంటి నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను కూడా కాదని వైసీపీ నుంచి పోటీ చేసిన జూనియ‌ర్ల‌ను గెలిపించామ‌ని .. అయితే వారంతా అభివృద్ధిని , ప్రజలను గాలికి వదిలేసి సొంత పనుల్లో మునిగితేలుతున్నారు అని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.

రెండున్నర సంవత్సరాలకే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చేసిందని... సొంత పార్టీ నేతలే తమ అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఏదేమైనా జిల్లాలో టిడిపి పుంజుకుంద‌న్న విష‌యం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: