
అయితే ఆయనకు సిటీ నియోజకవర్గంలో క్యాడర్ ఉంది..ఆ క్యాడర్‌ని ఆదిరెడ్డి ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై ఆ మధ్య బుచ్చయ్య రాజీనామా వరకు వెళ్ళిన విషయం తెలిసిందే. చంద్రబాబు బుజ్జగించడంతో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో బుచ్చయ్య మళ్ళీ యాక్టివ్‌గా పనిచేసుకుంటున్నారు. అటు సిటీలో ఆదిరెడ్డి భవానీ ఆమె భర్త శ్రీనివాస్ పనిచేసుకుంటున్నారు.
ఇక అంతా సజావుగా సాగుతుందనుకునే సమయంలో భవాని భర్త శ్రీనివాస్ ట్విస్ట్ ఇచ్చారు. బుచ్చయ్యపై పరోక్షంగా ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా బుచ్చయ్యని టార్గెట్ చేశారు. తమ అధినాయకుడుని మంగళగిరి వెళ్లి కలుస్తారని, క్షేత్ర స్థాయిలో అదే నాయకుడిని అమ్మానా బూతులు తిడతారని, వీరా సీనియారిటీ కలిగిన నాయకులు... వారి లక్షణాలు ఇవేనా అంటూ వాసు ఫైర్ అయ్యారు. వారికి విలువంటూ ఉందా..? గెలుపోటములు సర్వ సాధారణమని, అంత మాత్రాన దిగజారుడు వ్యవహారాలు చేయకూడదని, కాలమే అన్నింటికీ సరైన సమాధానం చెబుతుందని పోస్టు పెట్టారు.
అంటే ఇటీవలే బుచ్చయ్య...మంగళగిరి వచ్చి చంద్రబాబుని కలిశారు. ఇక ఈయన క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్తితి గురించి డైరక్ట్‌గానే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భవాని భర్త వాసు...ఇలా బుచ్చయ్యని టార్గెట్ చేసి విమర్శలు చేశారని తెలుస్తోంది. అయితే ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రచ్చకు చంద్రబాబు బ్రేక్ వేయాల్సిన అవసరముంది.