కాంగ్రెస్ కురువృద్ధుడు రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. గొప్ప వక్త, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు, అత్యధిక సార్లు  బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదే. రోశయ్య మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని, ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటు. తెలుగు ప్రజలు అందరూ రోశయ్య గారిని చూసి, రోశయ్య గారి మాట విని చాలా రోజులు అవుతుందని అనే భావనలో ఉంటున్న సమయం ఇది.

 ఆయన గవర్నర్ గా వెళ్లి అయిదు సంవత్సరాలు బయటనే ఉండి వచ్చారు. ఆయన కర్ణాటక గవర్నర్ గా ఉన్న కాలం చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యవధిలో ఎప్పుడైనా వచ్చినా కుటుంబ పరంగా వచ్చే వారే తప్ప ఎక్కువగా బయటకు రాలేదని రోశయ్య తన చివరి ఇంటర్వ్యూలో చెప్పారు.  ఆయనకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. కానీ ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కుటుంబం నుంచి రాజకీయ వారసులు అనేవారు వస్తున్నారు. కానీ రోశయ్య కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా రాజకీయంగా బయటకు రాలేదు. దీనిపై  ప్రశ్నించగా ఎవరి ఇష్టం వారిది అని, వారికి ఇష్టం ఉంటే వస్తారు లేదంటే లేదు అని సూటిగా సమాధానం ఇచ్చారు. స్వాతంత్ర ఉద్యమం నుంచి రాకెట్ యుగం వరకు రోశయ్య రాజకీయాల్లో ఉన్నారు. దీనిపై ఆయన ఎంతో బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి అని, మా కాలంలో  గురువు శిష్యుడు అనే పదం ఉండేదని, రాజకీయ పాఠాలు కూడా నేర్చుకునే వాళ్లమని , ప్రస్తుతం పద్ధతులు ఏమీ లేవని ఆయన ఆ సందర్భంగా తెలియజేశారు. ఆయన 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని తెలుస్తోంది.  ఈ విధంగా ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని  అప్పటి నుంచి తుది  శ్వాస విడిచే వరకు ప్రతి రాజకీయ ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వారిలో  రోశయ్య ఒక్కరని  చెప్పవచ్చు. ఆయన ప్రతిభాపాటవాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని  ఆయన అకాల మరణం ప్రస్తుత రాజకీయాలలో ఒక బాధను మిగిల్చిందని తెలుస్తోంది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాలు ఒక మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: