డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ తో రీఇన్ ఫెక్షన్ మూడు రెట్లు ఎక్కువగా కనిపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. ఒమిక్రాన్ సోకిన వారికి 90రోజుల తర్వాత మళ్లీ ఇన్ ఫెక్షన్ వస్తుందని దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన డేటాలో వెల్లడైందని ఆమె చెప్పారు. ఆ దేశంలో ఒమిక్రాన్ కారణంగా ఎక్కువ మంది పిల్లలు ఆస్పత్రి పాలవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయని సౌమ్య అన్నారు.

మరోవైపు ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా భారత్ ట్రావెల్ బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్రయాణ నిషేధం అవసరం లేదని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ చెప్పింది. దేశంలో అదనపు డోసులు పెంచడం లేదా బూస్టర్ డోసులు ఇవ్వడంపై ఆలోచించాలని ప్రభుత్వం కోరింది. వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్, రోగ నిరోధక శక్తి లేనివారి కోసం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

ప్రమాదకర ఒమిక్రాన్ వేరియంట్ పై ఆందోళనలు నెలకొన్న కారణంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అంతా సాధారణ స్థితికి తిరిగి వస్తున్న సమయంలో మళ్లీ ఈ వైరస్ రావడం భారతదేశానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు మనం తగిన చర్యలు తీసుకోకపోతే రెట్టింపు ప్రభావంతో.. థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ సక్రమంగా చేయిస్తే దేశాన్ని కాపాడుకోగలం అని ఇండియన్ మెడికల్ అసోషియేషన్ పేర్కొంది.

ఇక తాజాగా మన దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం నాటి పరీక్షల్లో 8వేల 306 కేసులు నమోదవగా.. గత 24గంటల్లో 6వేల 822కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 220మంది మహమ్మారి వల్ల చనిపోయారు. నిన్న 10వేల 4 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 95వేల 14యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 128.76కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.












మరింత సమాచారం తెలుసుకోండి: