దాసరి శ్యామ్ చంద్ర శేషు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం శేషు స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శేషు చిన్నప్పటినుంచే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. శేషు విద్యార్థిగా ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేశారు.. ముఖ్యంగా పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్రా యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పని చేసిన శేషు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని నాడు కాంగ్రెస్ చ‌ర్య‌ల‌పై ఏయూ వేదిక‌గా పోరాటాలు చేశారు.
పార్టీ పట్ల శేషు ఉన్న అంకితభావంతో పాటు కష్టాన్ని గుర్తించిన దివంగ‌త కేంద్ర మాజీ మంత్రి ఎర్ర‌న్నాయుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, నాడు విశాఖ జిల్లా టీడీపికి పెద్ద దిక్కుగా ఉన్న ఎంవీవీఎస్‌. మూర్తితో పాటు నాడు పార్టీ పార్ల‌మెంట‌రీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి చిక్కాల రామ‌చంద్ర‌రావు శేషు అయితేనే ఆంధ్ర యూనివర్సిటీ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా కరెక్ట్ అని భావించారు. దీనికితోడు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు... ఉత్తరాంధ్రలోని పలువురు సీనియర్ నేతలు సైతం శేషుకు మద్దతు తెలిపారు.
యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించిన శేషు తర్వాత అక్కడే డాక్టరేట్ కూడా పూర్తి చేశారు. విశాఖ నగరం, జిల్లాతో పాటు ఉత్తరాంధ్రలో పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన 2014 ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీ కేడర్లో చాలావరకు నిరాశా... నిస్పృహలు నెలకొన్నాయి. ఆయనా శేషు అధికార వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
2024 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడానికి ఏం ? చేస్తే బాగుంటుంది అన్న అంశంపై రెండు మూడు సార్లు పార్టీ అధినేత చంద్రబాబును కలిసి నివేదికలు కూడా సమర్పించారు. శేషు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్షల‌కు... అన్ని కార్యక్రమాలకు హాజరు అవడంతో పాటు ఢిల్లీలో రాష్ట్ర హక్కులకోసం చంద్రబాబు చేసిన ఎన్నో దీక్షలో స్వయంగా పాల్గొని చంద్రబాబు దృష్టిలో పడ్డారు.
రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా దూకుడు:
పార్టీ గత ఏడాది ప్రకటించిన రాష్ట్ర కమిటీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన శేషు అప్పట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ అప్పగించిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ పరిశీలకులుగా వెళ్లిన శేషు.... ఇటీవల కృష్ణా జిల్లాలో పార్టీ విజయం సాధించిన కొండపల్లి మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా కూడా వెళ్లారు. కొండపల్లి మున్సిపాలిటీలో అమలాపురం మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనంద రావుతో కలిసి వైసిపి ప్లాన్ చేసిన‌ దొంగ ఓట్లకు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశంసలు పొంద‌డంతో పాటు విజ‌యం అనంత‌రం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో కొండ‌ప‌ల్లి విజ‌యంపై జ‌రిగిన స‌మీక్ష‌లో సైతం బాబు నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు. పార్టీలో కొందరు నేతలు నుంచి సహాయ నిరాకరణ ఉన్నా కూడా శేషు త‌న ప‌ని తాను చేసుకుంటూ అంద‌రూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాడు. పార్టీ త‌ర‌పున అటు సోష‌ల్ మీడియాతో పాటు బ‌య‌ట బ‌ల‌మైన గొంతుకుగా ఉన్న శేషు ఏలూరు పార్ల‌మెంట‌రి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో శ‌క్తివంత‌మైన‌ రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా ప్ర‌శంస‌లు అందుకున్నాడు.
నాడు - నేడుతో జ‌గ‌న్‌కు రివ‌ర్స్ కౌంట‌ర్ ప్లాన్‌... లోకేష్ ప్ర‌శంస‌లు :
ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ నాడు - నేడు కాన్సెప్ట్‌ను రివర్స్‌లో ఎలా ఎటాక్ చేయాలో శేషు ఓ ప్లాన్‌ను రూపొందించారు. నాడు జ‌గ‌న్‌ హామీలు.. నేడు వైఫ‌ల్యాలు అన్న టైటిల్‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌లంగా ప్ర‌చారం చేయాల‌ని లోకేష్‌కు వివ‌రించారు. ఈ కాన్సెఫ్ట్‌ను సైతం లోకేష్ ప్ర‌త్యేకంగా మెచ్చుకుని శేషును అభినందించారు. బీసీల్లో బలమైన గౌడ సామాజిక వర్గం మంచి మంచి భవిష్యత్తు ఉన్న నేతగా.. శేషు నిలుస్తాడని పార్టీ సీనియర్లు సైతం ఆకాంక్షిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: