రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి మరీ దారుణంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే...అది నెల్లూరు జిల్లా అని చెప్పేయొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పలు జిల్లాల్లో టీడీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి...నెల్లూరుతో పాటు మరో మూడు జిల్లాల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు. కానీ ఎన్నికలయ్యాక టీడీపీ నిదానంగా పుంజుకుంటూ వస్తుంది. మరీ వైసీపీని డామినేట్ చేసేలా కాదు గానీ...గత ఎన్నికలతో పోలిస్తే...ఇప్పుడు పలు జిల్లాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైంది. అలాగే కర్నూలు, కడప లాంటి జిల్లాల్లో కూడా ఒకటి, రెండు సీట్లలో పట్టు పెంచుకుంది.

కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే..అలా అని టీడీపీ పుంజుకుందా? అంటే లేదనే చెప్పాలి. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉన్నా సరే...దాన్ని ఏ మాత్రం ఉపయోగించుకోలేని స్థితిలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు...పోనీ ఒకటి కాదంటే ఒకటి అని లేదు...నెల్లూరులో ఉన్నా 10 స్థానాల్లో పరిస్తితి అలాగే ఉంది.

ఇక ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే...వచ్చే ఎన్నికల్లో మళ్ళీ నెల్లూరులో టీడీపీకి ఒక సీటు కూడా రాదు. అందుకే ఇప్పటినుంచే చంద్రబాబు కాస్త కఠినంగా ఉండటం మొదలుపెట్టారు. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌లో ఒక డివిజన్ కూడా గెలుచుకోకపోవడంపై సీరియస్ అయిన ఆయన..పలువురు నేతలని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం పనిచేయకపోతే..మరికొందరుని బయటకు పంపించేస్తానని వార్నింగ్ ఇచ్చారు.

అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయని నాయకులని సైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నా ఇంచార్జ్‌ల్లో పలువురు నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. దీని వల్ల పార్టీ పరిస్తితి మరీ దారుణంగానే ఉంది. ఇక అలాంటి నియోజకవర్గాల్లో నేతలని మార్చేసి...కొత్త నాయకులని బరిలో దింపే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో తమ్ముళ్ళ సీట్లు చిరిగేలా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: