రాజకీయ నాయకులు ప్రజల మనుషులు కాబట్టి ఎప్పుడూ ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది ఇక ఎప్పుడైనా నోరు జారి మాట్లాడారు అంటే చాలు చివరికి తీవ్ర స్థాయిలో విమర్శలు పాలు అవుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో రాజకీయ నాయకులను ఎంతోమంది ఒక ఆటాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ హాట్ టాపిక్ గా మారిపోయే ఒక ఎంపీ ఇక ఇప్పుడు మరో సారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.. దీనికి కారణం ఆమె ఇటీవలే క్రికెట్ ఆడటమే.

 క్రికెట్ పోటీలను ప్రారంభించడానికి వెళ్లిన ఆమె బ్యాట్ పట్టుకొని క్రికెట్ఆడింది. ఆట గాళ్లు అందరిలో కూడా ఎంతగానో ఉత్సాహాన్ని నింపింది. ఇక ఇప్పుడు ఆ ఎంపీ క్రికెట్ ఆడటమే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు భూపాల్ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాగూర్ ఎప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ చెప్పి బెయిల్ పై బయటికి వచ్చారు. ఎంపీ ప్రగ్య సింగ్ ఠాకూర్ ఎన్నో రోజుల నుంచి వీల్ చైర్ కి మాత్రమే పరిమితం అయ్యారు.


 కానీ ఇటీవలే మైదానంలో బ్యాట్ పట్టుకొని ఎంతో హుషారుగా క్రికెట్ ఆడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్నారు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. 2017లో అనారోగ్య సమస్యలను కారణంగా చూపుతూ బెయిల్ పై బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె ఎక్కడికి వెళ్లినా వీల్చైర్ పైన కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే వీల్ చైర్ పైన కాకుండా ఏకంగా ఎంతో హుషారుగా కబడ్డీ ఆడటం, నవరాత్రి ఉత్సవాల్లో నృత్యం చేయడం చర్చనీయాంశంగా మారి పోవడంతో ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయ్. ఇక ఇప్పుడు మరోసారి మైదానంలో  బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతూ కనిపించారు ప్రగ్యాసింగ్ ఠాగూర్. దీంతో బెయిల్ కోసం ఎంపీ చెప్పిన ఆరోగ్య సమస్యలు మొత్తం ఒక అబద్దమే అంటు ఎంతో మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: