సినిమా టికెట్ల వివాదం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ప్రభుత్వ తీరును నిరసిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద వరకు సినిమా థియేటర్లు మూత పడ్డాయి. ఇక ప్రభుత్వం నిర్ణయించిన ధరకు టికెట్లు విక్రయిస్తే... నష్టాలు తప్పవంటున్నారు థియేటర్ల యజమానులు. చివరికి ఆసియాలోనే అతి పెద్ద స్ర్కీన్ ఉన్న సుళ్లూరుపేట థియేటర్ యాజమాన్యం కూడా... ఈ ధరలకు సినిమా ప్రదర్శన మా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేశారు. ఇక ఇదే విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరపాలంటూ సినీ పరిశ్రమ పెద్దలకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు, థియేటర్ల యజమానులు కోరుతున్నారు. ఇటు ధరల విషయంపై ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ సినిమా హీరోలు నాని, సిద్దార్థ్ వంటి హీరోలు బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సమస్యకు పరిష్కారం చూపాలంటూ థియేటర్ల యజమానులు ఇప్పటికే మంత్రి పేర్ని నానితో చర్చలు కూడా జరిపారు.

ఇప్పుడు తాజాగా జగన్ సర్కార్‌పై మరో ప్రముఖ దర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ సమయంలో జగన్ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు రాము. టికెట్ ధర విషయంలో ప్రభుత్వ పెత్తనం ఏమిటంటూ ప్రశ్నించారు. టికెట్ ధరను నిర్ణయించే హక్కు కేవలం ఉత్పత్తి దారుడికి మాత్రమే ఉంటుందని ఆర్జీవీ కామెంట్ చేశారు. అసలు టికెట్ల ధరలను ప్రభుత్వాలు తగ్గించడం ఏమిటని కూడా రాము ప్రశ్నించారు. వస్తువు తయారు చేసిన వ్యక్తికే దాని ధరను నిర్ణయించే అధికారం ఉంటుందని... ఆ ధరకు కొనాలా.... వద్దా అనేది వినియోగదారుల ఇష్టం అని సూచించారు ఆర్జీవీ. అదే విధంగ సినిమా టికెట్ల ధరలను నిర్మాతలు నిర్ణయించుకుంటే... ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలని వర్మ నిలదీశారు. ప్రభుత్వానికి కేవలం పన్నులు మాత్రమే వసూలు చేసుకునే హక్కు ఉందన్నారు. అంతే కానీ... ధరల విషయంలో ప్రభుత్వ పెత్తనం తనకు ఏ మాత్రం అర్థం కావడం లేదన్నారు ఆర్జీవీ.


మరింత సమాచారం తెలుసుకోండి:

RGV