ఇండియాలో దాదాపు 150 మిలియన్లు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో దాదాపు 60 మిలియన్ల మంది లేడీస్ ఎక్కువగా ఇంటర్నెట్‌ని వాడుతున్నారు. వీరిలో 75% మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయస్సు వున్నవారు. వీరు తమ లైఫ్ స్టైల్ ని మెరుగు పరచుకోవడానికి ఎక్కువుగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఏమి సెర్చ్ చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక అమ్మాయిలు ఎక్కువగా కెరీర్  సంబంధిత సమాచారం ఎక్కువగా వెతుకుతున్నారని నివేదిక ప్రకారం సమాచారం తెలుస్తోంది. తమ కెరీర్ ను ఎలా డెవలప్ చేసుకోవాలి. ఏ విధమైన కోర్సులు సెలెక్ట్ చేసుకోవాలి. తమకు ఎదురైన ఛాలెంజ్ లను ఎలా ఫేస్ చెయ్యాలి అనే విషయంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.ఇక గత కొంతకాలంగా కూడా అమ్మాయిలు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. బట్టల డిజైన్‌లు ఇంకా కొత్త కలెక్షన్లు అలాగే ఆఫర్‌ల వంటి వాటిని సెట్స్ లో ఎక్కువగా వెదుకుతున్నారని తెలిసింది.

నేటి యూత్ అందంగానే కాదు.. డిఫరెంట్ స్టైల్ లో కనిపించడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందుకనే బ్యూటీ టిప్స్, ఫ్యాషన్ ట్రెండ్స్ ఇంకా అలాగే హోం రెమెడీస్ గురించి ఎక్కువగా వెతుకుతున్నారని అధ్యయనాల ద్వారా సమాచారం తెలిసింది.ఇక ఎప్పుడు ఏ కాలంలో నైనా అమ్మాయిలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మాయిలు గోరింటాకు బదులుగా మెహందీ డిజైన్స్ ను ఇష్టంగా పెట్టుకుంటున్నారు. అందుకనే అమ్మాయిలు తరచుగా గూగుల్‌లో హెన్నా లేటెస్ట్ డిజైన్‌లను సెర్చ్ చేస్తున్నారట.ఇక మ్యూజిక్ వినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే అమ్మాయిలు మాత్రం ఆన్ లైన్ లో రొమాంటిక్ సాంగ్స్ వినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ మేరకు వాటి కోసం సెర్చ్ చేస్తారట. అంతేకాదు అమ్మాయిలు ఇంటర్నెట్‌లో రొమాంటిక్ కవిత్వాన్ని కూడా సెర్చ్ చేస్తారని అధ్యయనంలో తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: