దేశం అటెన్షన్ అంతా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మీదే కనిపిస్తోంది. ఇంతకాలం కొంచెం సైలెంట్ గా కనిపించిన ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే ఒక్కసారిగా పుంజుకుంది. అదికూడా చిత్రవిచిత్రమైన రాజకీయాలతో ప్రధాన పార్టీలకు షాకుల మీద షాకులు తెప్పిస్తోంది. ఓ వారం రోజుల పాటు బిజెపిని ఇబ్బందుల్లో పెట్టిన షాక్ లు ఇప్పుడు రివర్స్ లో ఎస్పీ అధినేతకే షాక్ కొడుతోంది. ములాయం ఇంటినుంచే ఇప్పుడు కమలం పార్టీలోకి వలసలు వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటేక్కినట్లు కల్పిస్తోంది.

 మొదటి దశకే ఇలా ఉంటే ముందు ముందు పరిణామాలు చూడబోతున్నాం అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా యూపీలో అధికారం నిలబెట్టుకోవడం కోసం బిజెపి వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తోంది. జాతీయ నాయకత్వం కేరాఫ్ లక్నో అంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు మోడీ ఇటు యోగి వ్యవహారం తట్టుకుంటూ సింగిల్ గానే అఖిలేష్ యాదవ్ ప్రతి వ్యూహాలు విసురుతున్నారు. ఒపీనియన్ పోల్స్ ఎలా చెబుతున్నా,ఎవరి అంచనాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తనదేనని చెబుతున్నారు. అఖిలేష్ లో ఈ ధీమాకు కారణమేంటి..? ఎస్పీ తరఫున అఖిలేష్ వన్ మ్యాన్ షో చేస్తున్నారా..? బిజెపి సమాజ్వాదీ పార్టీకి మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ వ్యూహాలతో అఖిలేష్ యాదవ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. పెద్ద నాయకులను కాదు క్షేత్రస్థాయిలో కమలం పార్టీ నేతలను దెబ్బకొట్టేందుకు తన మార్కు వ్యూహాలు అనుసరిస్తున్నారు. గోరక్ పూర్ టికెట్ విషయంలో అఖిలేష్ యాదవ్ ప్రకటన, నిర్ణయం ఇప్పుడు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను గోరక్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ముందుగా యోగి నుంచి బిజెపి టిక్కెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా, అధికారిక ప్రకటన మాత్రం భిన్నంగా వచ్చింది. అయితే యోగి కోసం గోరక్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే  డా.రాధామోహన్ అగర్వాల్ కు టికెట్ నిరాకరించింది.

ఈ అవకాశాన్ని సమాజ్వాది పార్టీ యోగిపై అస్త్రంగా మార్చుకోవాలని భావించింది. రాధా మోహన్ కి తమ పార్టీ టికెట్ ఇవ్వాడానికి సిద్ధంగా ఉన్నామని అఖిలేష్ ఆఫర్ ఇచ్చారు. ఇలా ఒక రకంగా ఒంటరిపోరు స్టార్ట్ చేశారు. అఖిలేష్ స్టార్ట్ చేసిన మైండ్ గేమ్ ఇప్పుడు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో యూపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొదటి దశ ఎన్నికల్లోనే సీన్ ఇలా ఉందంటే ఇకపై మరింత రసవత్తరంగా మారడం ఖాయం. అద్భుతాలు చూసినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా బీజేపీలో ప్రకంపనలకు అఖిలేష్ యాదవ్ మాత్రం కారణమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: