1919 డిసెంబర్ 16వ తేదీన గుంటూరు జిల్లా అమృతలూరు మండలం లోని బోడపాడు గ్రామం లో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు వెంకటరావు. యడ్లపాటి వెంకటసుబ్బయ్య రాఘవమ్మ దంపతులకు జన్మించారు. గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో బీఏ చదివిన ఆయన ఇక 1941లో చెన్నైలో కాలేజీలో చదువుతూ ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. తర్వాత న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాదిగా కూడా ఎన్నో రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయనకి కుమారుడు కుమార్తె ఉన్నారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి స్వతంత్ర పార్టీ తరఫున వేమూరు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1967, 72 ఎన్నికలలో శాసనసభకు ఎన్నికయ్యారు యడ్లపాటి.
1972లో కాంగ్రెస్ ప్రభంజనంతో దేశం మొత్తం అందరు ఓడిపోతే కోస్తా జిల్లాలో మొత్తం మీద ఈయన ఒక్కరే విజయం సాధించడం గమనార్హం. ఇక మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కూడా న్యాయ శాఖ వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తర్వాత అదే పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఆయన రైతుల పక్షాన నిలబడుతూ ఎప్పుడు రైతుల అభ్యున్నతి కోసం పోరాడుతూ ఉండే వారు యడ్లపాటి. ఈయన ఈయన మృతి పట్ల అటు టీడీపీ నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి