బ్రెంట్ క్రూడ్ ధర కూడా 113 డాలర్లు దాటేసింది. WTI కూడా క్రాస్ చేశాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా నాలుగు నెలలుగా భారత్ లో మాత్రం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ లోనూ ధరలు పెరగబోతున్నట్లు సమాచారం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుతూ పెరుగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ లోనూ పెట్రోల్, డీజల్ ధరలను పెంచనున్నట్లు తెలుస్తోంది.
అది కూడా భారీగా అన్నట్లు టాక్. లీటర్ కు రూ.12 వరకు పెంచడానికి యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగగా ఇపుడు ఆ నష్టాలను భర్తీ చేసేందుకు గాను ఈ తరహా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంటున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు దాదాపు చివరి దశకు చేరుకోగా ఈ చమురు ధరల అంశాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ నాలుగు నెలలు గుర్తుకు రాని పెట్రోల్ డీజల్ ధరలు ఎన్నికలు ముగింపుకు వస్తున్న తరుణంలో గుర్తుకు రావడం పై కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలా అయితే ముందు ముందు పెట్రోల్ ఎలా వాడాలి అంతో ఏకరువు పెడుతున్నారు.
అయితే సగటు మధ్య తరగతి వారికి మాత్రం ఈ పెరిగే ధరలు భారంగా మారుతాయి. ఏకంగా లీటర్ పై 12 రూపాయలు అంటే మరి సామాన్య ప్రజలకు నెత్తిపై పిడుగు పడ్డట్లే అవుతుంది. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగితే లీటర్ కు 12 రూపాయలకు మించి కూడా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి