అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్ లు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదు. మరోవైపు కీలక నేతలు ఆ పార్టీని వేడుకున్నారు. ఈ క్రమంలో గురువారం బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను బరిలో నిలపగా ఆమె తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కు లేఖ రాశారు. లేఖలో అవినీతి ఆరోపణలతో పార్టీ పరువు ప్రతిష్టలు దిగజారాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

చాలాకాలం నుండి కడియం పార్టీ మారుతారని వార్తలు వస్తున్నప్పటికీ ఆయన వాటిని ఖండిస్తూనే వచ్చారు. కానీ సడన్ గా నేడు ఢిల్లీలో ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ పార్టీని వీడుతున్న వారిని ఉద్దేశించి సెన్సేషనల్ పోస్ట్ చేశారు.. శూన్యం నుండి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే కెసిఆర్ సాధించాడని పేర్కొన్నారు.

ఒక్కడిగా బయలుదేరి లక్షల సైన్యాన్ని తయారుచేసి ఎన్నో అవమానాలు ద్రోహాలు, కుట్రలు...కుతంత్రాలు అన్నింటినీ చేదించిన ధీరత్వం కేసీఆర్ అని అన్నారు. అలాంటి ధీరుడుని కొన్ని కప్పదాట్లో... ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ దేహరులకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. ప్రజా ఆశీర్వాదం మద్దతుతో 14 ఏళ్ళు పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి తెచ్చుకున్నామని అన్నారు.

కోట్లాదిమంది జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. నికార్సైన కొత్త నాయకత్వం తయారు చేస్తామని..... పోరాట పంతాలో కదం తొక్కుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా పార్టీలో కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దానికి కారణం పార్టీలో కీలక పదవులు అనుభవించిన చాలామంది ఇప్పుడు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు.

దీంతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు కొత్త నాయకత్వం కావాలని.. బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ గా పేరు మార్చాలని కోరుతూ పోస్ట్లు చేస్తున్నారు. ఎట్టకేలకు కేటీఆర్ సైతం అదే విషయంపై దృష్టి పెట్టినట్టు ఆయన ట్వీట్ లో స్పష్టం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: