మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వయస్సు 75 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడుకు 14 సంవత్సరాల అనుభవం అనే సంగతి తెలిసిందే. అయితే బహిరంగ సభలలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పొరపాటున కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
 
నోరు జారి బాబు అడ్డంగా బుక్కయ్యాడుగా అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇకపై మాట్లాడే మాటల విషయంలో మరింత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. మరోవైపు జగన్ మేనిఫెస్టోకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చేశారు. అమలు చేయలేని హమీలను తాను ప్రకటించబోనని కామెంట్లు చేయడం గమనార్హం. చంద్రబాబు పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు చేయగా పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
 
ఏపీలో కూటమి హవా ఉండాలని చంద్రబాబు పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. అయితే సర్వేలు మాత్రం చంద్రబాబుకు వరుస షాకులిస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేము. అర్బన్ ఓటర్లు అనుకూలంగా ఉండటం కూటమికి ప్లస్ అవుతుండగా మహిళల ఓట్లను నమ్ముకుని వైసీపీ రాజకీయాలు చేస్తుండటం గమనార్హం. అయితే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేము
 
వేర్వేరు అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కొంతమంది ఓటర్లు మాత్రం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా పరిస్థితి మారదని కామెంట్లు చేస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఏ పార్టీకి ప్లస్ అవుతాయో ఏ పార్టీకి మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది. కూటమి ఓటమిపాలైతే మాత్రం జనసేన, టీడీపీలకు వచ్చే ఐదేళ్లు సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: