తిరుపతి టీడీపీకి కలిసి వస్తుందా..
•వైసిపి అడ్డాగా తిరుపతి మారనుందా..

ఆంధ్రప్రదేశ్లోని  అన్ని జిల్లాల్లో కంటే తిరుపతి జిల్లా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక నగరిగా పేరుపొందిన తిరుపతిలో  ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి అత్యధిక పర్యాయాలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ విజయం సాధించింది.  రాష్ట్ర విభజన తర్వాత 2014,19 సాధారణ ఎన్నికల్లో, 2021 ఉప ఎన్నికల్లో  వైసిపి వరుస విజయాలను అందుకుంది. ఈ విధంగా వైసిపి కంచుకోట అయినటువంటి తిరుపతి పార్లమెంటు పరిధిలో ఈసారి  ఎవరి బలం ఎంత ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.


 తిరుపతి పార్లమెంటు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తి,  కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా వరప్రసాద్ మధ్య పోటీ ఏర్పడింది. గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కావడం  ఆయనకు కలిసివచ్చే అంశం. అంతేకాకుండా తిరుపతికి రైల్వే స్టేషన్ అభివృద్ధి తీసుకురావడంలో ఆయన  కీలక పాత్ర పోషించారు. పులికాట్ సరస్సు పరిరక్షణలో కూడా  అద్భుతమైన పనితీరు కనబరిచారట. ఇక కూటమి నుంచి వరప్రసాద్ పోటీ చేస్తున్నా కానీ  ఈయనపై కాస్త మైనసే ఉంది. తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచిన అభివృద్ధి ఏమి చేయలేదని టాక్ వినిపిస్తోంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో  మళ్ళీ వైసిపికే మంచి పట్టు ఉండే అవకాశం కనిపిస్తోంది.
 సూళ్లూరుపేట:
 కిలివేటి సంజీవయ్య Vs విజయశ్రీ
 తిరుపతిలోని కీలక నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట కూడా ఒకటి. ఇక్కడ వైసిపి అభ్యర్థి బలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
గూడూరు:
 మురళీధర్ Vs సునీల్ కుమార్
 ఇక్కడ కూడా వైసీపీకే ఎక్కువ పట్టు ఉండే అవకాశం కనిపిస్తోంది. గతంలో వైసిపి అభ్యర్థి అభివృద్ధి  ఎక్కువగా జరగడం వల్ల ప్రజలు వైసీపీకే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
 వెంకటగిరి:
 రామ్ కుమార్ రెడ్డి Vs లక్ష్మీ సాయి ప్రియ
 ఇక ఈ నియోజకవర్గంలో  వైసిపిని బీట్ చేసి టిడిపి ముందు స్థానంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
 సత్యవేడు :
 రాజేష్Vs ఆదిమూలం:
 సత్యవేడు నియోజకవర్గం లో కూడా ఈసారి వైసిపి తన జెండా ఎగరవేయబోతుందట.
 శ్రీకాళహస్తి:
 మధుసూదన్ రెడ్డిVs వెంకట సుధీర్ రెడ్డి
 శ్రీకాళహస్తి నియోజకవర్గం లో  వైసీపీలో ఏర్పడిన వర్గ పోరు వల్ల టిడిపికి కాస్త ఫేవర్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది.
 తిరుపతి:
 అభినయ రెడ్డి  Vs శ్రీనివాసులు
 ఆంధ్రప్రదేశ్లోని  175 నియోజకవర్గాల్లో  తిరుపతి నియోజకవర్గంలో చాలా కీలకమైనది.  ఈ నియోజకవర్గంలో కూడా వైసిపి అభ్యర్థి  విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: