- బాబు క‌ల‌లు క‌నే రంగాల‌కు చెందిన పారిశ్రామిక‌వేత్త‌లు
- ఐటీ రంగంలో లోకం మాధ‌వికి గుర్తింపు
- స‌క్సెస్‌ఫుల్ ఇండ‌స్ట్రీయ‌లిస్టుగా సుజ‌నా చౌద‌రి

( ఉత్త‌రాంధ్ర - విశాఖ‌ప‌ట్నం )

ఏపీ అసెంబ్లీలోకి కొత్త‌గా ఇద్ద‌రు పారిశ్రామిక వేత్త‌లు అడుగు పెడుతున్నారు. అసెంబ్లీ విష‌యంలో వీరికి పూర్తి గా కొత్తేన‌ని చెప్పాలి. అయితే.. వారి వారిరంగాల్లో మాత్రం వారికి సీనియార్టీ ఉంది. అందునా.. వీరిద్ద‌రూ కూడా.. సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు క‌నే రెండు కీల‌క రంగాల‌కు చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వీరిద్ద‌రూ ఎన్డీయే పార్టీల్లో కూట‌మి నేత‌లు. వారే.. ఒక‌రు విజ‌య‌వాడ వెస్ట్ నుంచి విజయం ద‌క్కించుకున్న బీజేపీ అభ్య‌ర్థి సుజ‌నా చౌద‌రి. రెండోవారు.. జ‌న‌సేన అభ్య‌ర్థి నెల్లిమ‌ర్ల నుంచి గెలిచిన లోకం మాధ‌వి.


వీరిద్ద‌రూ కూడా డిఫ‌రెంట్ రంగాల్లో ల‌బ్ధ ప్ర‌తిష్టులు. సుజ‌నా చౌద‌రిని తీసుకుంటే.. ఆయ‌న పారిశ్రామికం గా అనేక సంస్థ‌ల‌ను స్థాపించి.. విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. సుజ‌నా గ్రూపు సంస్థ‌లు హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ స‌హా అనేక ప్రాంతాల్లో విస్త‌రించారు. విద్యాసంస్థ‌లు కూడా ఉన్నాయి. అదేవిధం గా నూత‌న ప‌రిశ్ర‌మ‌లు, ఇంజ‌నీరింగ్‌, వ్య‌వ‌సాయం వంటి రంగాల్లోనూ సుజ‌నా ప‌రిశ్ర‌మాలు స్థాపించి విజ‌యవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు.


రాష్ట్రంలో చంద్ర‌బాబు కూడా.. పారిశ్రామిక ప్ర‌గ‌తికి బాట‌లు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. అసెంబ్లీ వేదిక‌గా.. సుజ‌నా ఇచ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డ‌నుంది. పైగా.. పెట్టుబ‌డులు పెట్ట‌డంలోనూ.. పెట్టించ‌డంలోనూ సుజ‌నాకు సాటి మ‌రెవ‌రూ లేరు. వ్యాపార రంగంలో ఆయ‌న‌కు ఉన్న అపార‌మైన అనుభ‌వం.. అసెంబ్లీ వేదిక‌గా రాష్ట్రానికి దోహ‌ద‌ప‌డుతుంద‌నే అభిప్రాయం ఉంది.


ఇక‌, లోకం మాధవి.. ఐటీ రంగంలో ప్ర‌గ‌తి ప్ర‌స్థానం సాధించారు. విదేశాల్లోను.. స్వ‌దేశంలోనూ ఆమె అనేక కంపెనీలు స్థాపించారు. దుబాయ్‌, అమెరికా, స్విట్జ‌ర్లాండ్‌, బ్రిట‌న్‌ల‌లో ఐటీ కంపెనీలు నిర్వ‌హిస్తున్నారు. మ‌న దేశానికి వ‌స్తే.. చెన్నై , బెంగ‌ళూరుల్లోనూ.. కంపెనీలు స్థాపించారు. సుమారు 20 ఏళ్లుగా ఆమె ఈ కంపెనీల‌ను నిర్వ‌హిస్తుండ‌డంతో ఆమె అనుభ‌వం కూడా.. అసెంబ్లీ వేదిక‌గా.. ఐటీ ప్ర‌గ‌తికి దోహ‌ద‌పడు తుంద‌నే అభిప్రాయం క‌నిపిస్తోంది. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందు నిల‌పాల‌ని అనుకుంటున్న చంద్ర‌బాబుకు ఈమె ఇంధ‌నంగా ఉప‌యోగ‌ప‌డినాఆశ్చ‌ర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: