- పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి రేసులో మాజీ మంత్రి హ‌రీష్ రావు .. ?
- ప్ర‌తిప‌క్షం లోనూ కేసీఆర్ కుటుంబానికే ప‌ద‌వులా అని పార్టీ నేత‌ల ఫైర్ .. ?

( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేల మధ్య అసంతృప్తి ఉందా ? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ కేసీఆర్ ఫ్యామిలీ హవా నడిచింది. పదవులన్నీ కేసీఆర్ ఫ్యామిలీకి కట్టబెట్టుకున్నారు. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫ్యామిలీకి కీలక పెదవులు అన్ని కట్టబెట్టు తున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే కెసిఆర్ కుటుంబం మాత్ర‌మే అన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నన్ని రోజులు కీలకమైన పదవులు అధికారులు కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారాక‌ కూడా అదే పరిస్థితి నడుస్తోంది. తెలంగాణ అసెంబ్లీలో పిఎసి చైర్మన్ నియామకం చేపట్టాల్సి ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీకి చైర్మన్ అవకాశం ఇవ్వడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది.


ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి అదే చేయబోతున్నారు. అయితే ఈ పదవి కోసం మాజీ మంత్రి హరీష్ రావుకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆ పార్టీలోని కొంద‌రు సీనియర్ నేతలు కూడా తీవ్ర‌ అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ కూడా వారేనా ఇంకెవరికైనా అవకాశం ఇస్తే తప్పేంటి అని ఆ పార్టీలో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలుగా సబితా ఇంద్రారెడ్డి - సునీత లక్ష్మారెడ్డి - తలసాని శ్రీనివాస్ యాద‌వ్ - గంగుల కమలాకర్ వంటి చాలామంది ఉన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే పార్టీకి ఇంకా మైలేజ్ పెరుగుతుందని ఇంకా ఆలోచన ఎవరూ చేయటం లేదని పార్టీలో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: