ప్రస్తుతం ఉన్న ధరల పరిస్థితులలో సామాన్యుల సైతం గ్యాస్ సిలిండర్ ను తీసుకోవాలి అంటే ధరలు ఆకాశాన్ని తగులుతున్నాయి. అయితే ప్రతి నెల కూడా గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు అనేది సంభవిస్తూ ఉంటాయి. తాజాగా దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. 19 కిలోల బరువు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 15.50 తగ్గినట్లు తెలుస్తోంది. అయితే 14.2 కేజీల వంట ధరలలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అన్నట్లుగా తెలుస్తోంది.


ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ ధర రూ .1906 రూపాయలు ఉన్నది. ప్రతినెలా కూడా చమరు సంస్థలు ధరలలో మార్పులను సైతం చేస్తూ ఉంటాయి. అయితే ఈ నెలలో గ్యాస్ ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నప్పటికీ అందుకు భిన్నంగా ధరలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య ఉధృతత పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ధరల మార్పులు చోటు చేసుకుంటాయని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే చమురు ఓడలు ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి ఉన్నది.దీంతో గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి అనుకున్నారు. కానీ గత నెలలో వంట గ్యాస్ మీద 50 రూపాయలు పెంచారు.


కానీ ఈ నెలలో మాత్రం వంటగ్యాస్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. మొత్తానికి సామాన్యులకు పెంచకుండా కొంతమేరకు ఊరట కలిగించిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన 15.50 పైసలు తగ్గించడంతో వ్యాపారస్తులు కొంతమేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇప్పటికే అటు పెట్రోల్ ధరలు, నిత్యవసర సరుకులు కూరగాయలు కూడా అధిక ధరలతో సామాన్యుల నడ్డి విరిసేలా ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సైతం ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఉజ్వల పథకం కింద పేదవారికి సైతం గ్యాస్ తక్కువ ధరకే అందిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: