
అలా ఇప్పటికే భారత్ ఆర్మీలో ఐదు మంది సైనికుల సైతం మరణించారు. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కాల్పులలో మరొక బిఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందినట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్ దీపక్ చియాన్ వీరమరణం పొందినట్లుగా అధికారులు గుర్తించారు. ఈనెల 10వ తేదీన జమ్ములో ఆర్ఎస్ పురా ఏరియాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ కాల్పుల విరమణ సైతం ఉల్లంఘించి మరి కాల్పులు జరపడంతో దీపక్ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని అక్కడ బిఎస్ఎఫ్ అధికారులు నిన్నటి రోజున సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
శనివారం పాకిస్తాన్ కాల్పులలో బిఎస్ఎఫ్ చెందిన 8 మంది ట్రూపర్లు గాయపడ్డారట. ఎస్సై మహమ్మద్ ఇంతియాజ్ ఇటీవలే తీవ్ర గాయాలతో మరణించారు. హెడ్ క్వార్టర్స్ వదిలి మిలిటరీ లాంఛనాలతో ఇంతియాజ్ అంత్యక్రియలను సైతం నిర్వహించారు. ఇప్పుడు ఇంతలోనే మరొక బిఎస్ఎఫ్ జవాన్ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్, ఇండియా మధ్య రాజి కుదిరిచామంటూ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వాటన్నిటిని కూడా ఉల్లంఘించి మరి కాల్పులు చేస్తోంది అయినా కూడా భారత ఆర్మీ డ్రోన్లను, మిస్సైల్స్ ని, ఉగ్రవాదులను సైతం ఏరివేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ కేవలం డబ్బుల కోసమే యుద్ధం చేస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్థికంగా కూడా చాలా దారుణమైన పరిస్థితులలో ఉందని అందుకే ఇలా చేస్తుందనే విధంగా వినిపిస్తున్నాయి