ఇండియా పై పాకిస్తాన్ చైనా కుట్రలు చేస్తుందంటే నమ్మొచ్చు కానీ మిత్ర దేశమైన అమెరికా ఎందుకు కుట్రలు చేస్తుంది అనే అనుమానం చాలామందిలో వస్తుంది.అంతే కాదు ఇది ఫేక్ అని కొట్టిపారేస్తారు. కానీ పాకిస్తాన్, చైనాలు మాత్రమే కాదు అమెరికా కూడా ఇండియా పై కుట్ర చేస్తుందట. దొరికిందే సందు అని అమెరికా కూడా తన పని తాను చేసుకోవాలని చూస్తుందట. ఎందుకంటే రీసెంట్ గా ఇండో - పాక్ వార్ జరిగిన సంగతి మనకు తెలిసిందే.పహల్ గామ్ లో జరిగిన అటాక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రస్తావరాలను చిత్తు చేయడంతో పాటు కొంతమంది ఉగ్రవాదులపై మిస్సైల్స్ వేసి చిత్తు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా వీరి మధ్యలోకి వచ్చి సయోధ్య కుదిర్చినట్టు ట్రంప్ తనకు తానే ఒక పోస్ట్ చేశారు. 

ఇండో-పాక్ వార్ ముగిసింది అన్నట్లుగా పోస్ట్ చేశారు.అయితే కాల్పుల విరమణ ఒప్పందం జరిగాక కూడా పాకిస్తాన్ దొంగబుద్ధి చూపించింది. దాంతో వారికి దీటుగా ఇండియా బుద్ధి చెప్పింది. ఇదంతా పక్కన పెడితే ఇండియా పై అమెరికా ఎలా కుట్ర చేస్తుందంటే ఇండియాలో ఉన్న రాఫెల్ తమ దగ్గర ఉన్న f18 super hornet యుద్ధ విమానం కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉంటుందని నమ్మబలుకుతూ తమ దగ్గర ఉన్న ఆ యుద్ధ విమానాన్ని ఇండియాకి అమ్మాలని చూస్తోంది. అంతేకాదు ఇండియాకి F 35 అనే యుద్ధ విమానాన్ని అమ్మాలని అమెరికా తెగ ప్రయత్నం చేస్తుంది. కానీ భారత్ మాత్రం తమ దగ్గర ఉన్న యుద్ధ విమానాలపై పూర్తి నమ్మకం పెట్టుకుంది.

తమ త్రివిధ దళాల దగ్గర ఉన్న అన్ని యుద్ధ సామాగ్రి ఎంతో సమర్థవంతమైనవి అని సైలెంట్ గానే చాటి చెబుతున్నారు. అలాగే చైనా దగ్గర ఉన్న HQ-9 వ్యవస్థ విమానాలు ఇండియాలో ఉన్న S-400 వాయు రక్షణ వ్యవస్థ కంటే పెద్దదని చెబుతున్నారు. S-400 రక్షణ వ్యవస్థ తమ దగ్గర ఉన్న HQ-9 వ్యవస్థ కంటే చాలా తక్కువ సామర్థ్యం కలిగి ఉంది అని నమ్మబలుకుతున్నారు. ఇలా ఇండియా పై చైనా అమెరికాలు కుట్రలు చేస్తున్నప్పటికీ ఇండియా మాత్రం సైలెంట్ గానే వారందరికీ గట్టి షాక్ ఇస్తుంది. అంతేకాదు భారత్ సొంతంగా ఎన్నో యుద్ధ విమానాలను తయారు చేసుకుంది. భవిష్యత్తులో ఇతర దేశాలకు ఆయుధాలను, యుద్ధ సామాగ్రిని అమ్మే స్థాయికి వస్తుంది అనే ఉద్దేశంతోనే చైనా అమెరికాలు ఇండియా దగ్గర ఉన్న యుద్ధ విమానాలు తమ దగ్గర ఉన్న యుద్ధ విమానాల కంటే శక్తి సామర్ధ్యాలు తక్కువ అనే ప్రచారం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: