
కాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రీసెంట్ గానే తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో శివపురం వద్ద ఆయన కొత్త ఇంటిని నిర్మించుకున్నారు . ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు నూతన గృహప్రవేశం చేశారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు భార్య భువనేశ్వరి కొడుకు లోకేష్ కోడలు బ్రాహ్మిణి.. ఇతర కుటుంబ సభ్యులు అందరూ చాలా సంప్రదాయ పద్ధతిలో పూజ కార్యక్రమాలు చేసి కొత్త ఇంటిలోకి అడుగు పెట్టారు .
అంతేకాదు హిందూ సాంప్రదాయ ప్రకారం ఆవును పవిత్రంగా భావిస్తూ ఉంటారు . గృహప్రవేశం సమయంలో అవును పవిత్రంగా భావించి ఇంట్లోకి తీసుకువస్తారు . చాలామంది ఇలానే చేస్తూ ఉంటారు. హిందూ ఆచారాల ప్రకారం ఇంట్లోకి శుభాన్ని తీసుకువస్తుంది ఆవు అని నమ్ముతూ ఉంటారు. కుప్పంలోని చంద్రబాబు నూతన ఇంటి గృహప్రవేశ సమయంలో పుంగనూరు ఆవులను ఇంట్లోకి తీసుకొచ్చారు . ఈ ఆవులు చాలా చాలా స్పెషాలిటీ కలవి. ఏపీలోని చిత్తూరు జిల్లా లో ఈ జాతి ఆవులకు చాలా ఫేమస్ .
ఈ జాతి ఆవులకు ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అంతేకాదు వీటి ధర తెలిస్తే కచ్చితంగా షాక్ అయిపోతారు . ఒక్కొక్క ఆవు ధర కనీసం మూడు లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది . అంతేకాదు మామూలుగా ఆవు.. దూడలు సైజుల్లో పుంగనూరు జాతులు ఆవులు ముందు వరుసలో ఉంటాయి. కాళ్లు పొట్టిగా ఉండి ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది . అంతేకాదు ఇవి రెండు అడుగుల నాలుగు అంగుళాల నుంచి మూడు అడుగుల వరకు ఎత్తు పెరుగుతూ వస్తూ ఉంటాయి. దాదాపు 115 నుంచి 200 కిలోల బరువు ఈ ఆవులు ఉంటాయి. ఎక్కువగా బూడిద - తెలుపు రంగులోనే ఈ ఆవులు ఉంటూ ఉంటాయి . ఇలాంటి ఆవులు బయట కనిపించడం చాలా చాలా రేర్. పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే చాలా చాలా ప్రత్యేకమైనవి . ఈ ఆవులు పొట్టిగా ఉన్న చాలా దృఢంగా ఆకర్షణీయంగా ఉంటాయి..!