గత 24 గంటల నుండి పవన్ కళ్యాణ్ రాసిన ఓ లేఖ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అప్పటినుండి చాలా న్యూస్ ఛానెల్స్ డిబేట్ లు పెడుతూ ఇందులో ఎవరి పాత్ర ఎంతుంది అనే  సమాచారాన్ని బయటికి లాగుతున్నారు. కొంతమంది మీడియా చానల్స్ వాళ్ళు డిబేట్లు పెడుతూ ఇండస్ట్రీ కి సంబంధించిన వారిని ఆ డిబేట్లలోకి లైవ్ లోకి పిలుస్తూ వారి నుండి అనేక విషయాలు రాబడుతున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నిర్మాత అయినటువంటి నట్టి కుమార్ ఓ ఛానల్ కి ఇచ్చిన డిబేట్ లో c మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా పై కుట్ర చేస్తుంది ఎవరో కాదు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి,సురేష్ బాబు, అల్లు అరవింద్..

ఈ ముగ్గురే తెరవెనక ఉన్నారు.ఈ ముగ్గురే పవన్ కళ్యాణ్ పై కుట్ర చేస్తున్నారు.. అయితే నాకు వీరిపై ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ పవన్ కళ్యాణ్ పై మాత్రం వీరు ముగ్గురే కుట్ర జరుపుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉండడంతో జూన్ 1 నుండి థియేటర్లు బంద్ చేశారు. దీని వెనక ఉన్నది మాత్రం ఆ ముగ్గురే..పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బకొట్టాలనే అలా చేస్తున్నారు అంటూ నట్టి కుమార్ మాట్లాడారు. అయితే నట్టి కుమార్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.ఆయన మాట్లాడుతూ.. నిర్మాత నట్టి కుమార్ ఆధారాలు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడవద్దు.

 ఒకవేళ నేను ఇందులో ఉన్నానని చూపిస్తే ఆధారాలు చూపించండి. కానీ నాపై లేనిపోని పుకామర్లు చుట్టి వేయకండి. సినిమా థియేటర్లు బంద్ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాల్లో ఉన్నాననే అసూయతో కొంతమంది నా మీద కావాలనే ఇలాంటి వివాదాలు చుట్టి వేస్తున్నారు. ఇందులో నాకు సంబంధం లేదు. అసలు నట్టి కుమార్ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా కొన్ని మీడియా ఛానల్స్ దాన్ని వైరల్ చేస్తూ వివాదాన్ని సృష్టిస్తున్నారు అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. అటు అల్లు అరవింద్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ నలుగురిలో నేను లేను అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: