తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో కెసిఆర్ ఉన్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్సార్ కడప జిల్లాలో టిడిపి మహానాడు వేడుక చాలా అట్టహాసంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మహానాడుకు నాయకులు, కార్యకర్తలు అలాగే అభిమానులు భారీగా తరలివచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరించి... సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం టిడిపి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు.


ఈ నేపథ్యంలోనే... టిడిపి మహానాడులో గులాబీ వాసు కల్వకుంట చంద్రశేఖర రావు పాల్గొన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది తాజా ఫోటో కాదు. గతంలో ఎప్పుడో జరిగిన మహానాడుకు కేసిఆర్ వెళ్లారు. ఆ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. టిడిపి పార్టీలో కీలక పదవులు అనుభవించిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ పార్టీని ఏర్పాటు చేశారు.

 టిడిపిలో ఉన్నప్పుడు అన్ని మహాసభలకు కేసీఆర్ కూడా హాజరయ్యారు. ఆ ఫోటోనే ఇప్పుడు టిడిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన నేటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.   ఏంటి కేసీఆర్ మహానాడుకు వెళ్లాడా...? ఇది ఎక్కడి మాస్ ర్యాగింగ్ రా అంటూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక అదే సమయంలో టిడిపి మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పార్టీలో టిడిపి యూనివర్సిటీ నుంచి వెళ్లిన నేతలే ఉన్నారని గుర్తు చేశారు  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: