
అందుకే ఆయన వరుసగా గెలుస్తున్నారు. అయితే అచ్చెన్నాయుడును ఓడించేందుకు దువ్వాడ శ్రీనివాస్ పైన బాగానే అంచనాలు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే రెండుసార్లు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ గెలవలేదు. పెడడ తిలక్ పోటీ చేసినప్పటికీ వైసీపీకి ఓటమి తప్పలేదు. అయితే ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న వైసిపి నాయకులు కొర్ల శిరీష... ఎప్పుడు టెక్కలిలో యాక్టివ్ అవుతున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఆమెకు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం టెక్కలి నియోజకవర్గంలో ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వంపై వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి ఏరిపారేస్తున్నారు. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆమె ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు. అలాగే ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. టెక్కలి నియోజకవర్గం లో... కొర్ల కుటుంబానికి మంచి ఆదరణ కూడా ఉంది. శిరీష సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆమెకు టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు