ఆంధ్రప్రదేశ్లోని rrr రఘురామకృష్ణంరాజు నిరంతరం ఏదో ఒక విషయంలో వినిపిస్తూ ఉంటారు.2019-24 మధ్య వైసీపీ ఎంపీగా గెలిచిన ఈయన తన సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. అలా ఐదేళ్లు పోరాడిన తర్వాత 2024 ఎన్నికలలో టిడిపి పార్టీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉపసభాపతిగా అసెంబ్లీని నడిపిస్తూ ఉన్నారు రఘురామ.. అయితే ఇటీవలే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మాజీ మంత్రి గంటాతో పాటుగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవలే ఏపీ అంతటా కూడా పర్యటించారు RRR.


అయితే ఇందులో పలు సమస్యల పైన ఫిర్యాదులు వచ్చినట్లు తెలియజేశారు రఘురామ. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ప్రభావితం చేసే అంశం పైన సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అసలు ఈ విషయం చేసే పనేనా? అది సాధ్యమయ్యే పనేనా? అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అదేమిటంటే ఏపీలో 1.48 కోట్ల మంది రేషన్ కార్డును ఉపయోగిస్తున్నారు.. కార్డులు ఉన్నవారిలో ఎక్కువమంది రేషన్ బియ్యం తీసుకోలేదని రఘురామ కమిటీ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.. కేవలం వైద్యం కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారట. వీరు ఈ రేషన్ బియ్యానికి బదులుగా మార్కెట్లో లభించే సన్నబియ్యాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు.


ఇలా రేషన్ బియ్యం చాలా మంది వినియోగించుకోకపోవడం వల్ల అక్రమంగా బయటికి వెళ్లడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తున్నట్లుగా తమ కమిటీ గుర్తించిందట. అయితే రేషన్ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అందుకే రేషన్ కార్డు ని అందరు తీసుకుంటున్నారు తప్ప రేషన్ బియ్యాన్ని వినియోగించడం లేదని .. ఇలాంటి పరిస్థితులలో అక్రమ రవాణా కి అడ్డుకట్టుగా వేయాలని సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రేషన్ వినియోగించని కార్డులను వెనక్కి తీసుకున్నట్లు అయితే ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందంటూ తెలిపారు. అయితే రేషన్ బియ్యం తీసుకొని వారికి డబ్బు పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన తీసుకువచ్చిన ఇది సాధ్యం కాలేదు.  రేషన్ కార్డుల విషయంపై రేషన్ బియ్యం పై వస్తున్న ఈ వ్యాఖ్యలు చాలా మంది ప్రజలు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు..RRR సీఎం చంద్రబాబుకి సూచించిన ఈ విషయం బాగానే ఉన్న కానీ వీటి వెనుక చాలా రాజకీయ చిక్కులు ఉంటాయనే విధంగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. మరి సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఎలా ఆలోచిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: